తిరుమల శ్రీవారి దర్శనం (Tirupathi)సామాన్యులకు మృగ్యం అవుతోందా? అనే ప్రశ్న ఈ మధ్యకాలంలో భక్తుల మనసుల్లో కలుగుతున్న ఆవేదనను ప్రతిబింబిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆధ్యాత్మిక ఆశ్రయంగా నిలిచిన తిరుమల తిరుపతి (Tirupathi)దేవస్థానాలు నిర్వహిస్తున్న తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతిరోజూ వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది.పర్వదినాలు, సెలవుది నాలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఇంతటి విస్తారమైన భక్త సమూహాన్ని సమర్థంగా నిర్వహించడం ఒక మహత్తర బాధ్యత. అయినప్ప టికీ, సాధారణ భక్తుడి అనుభవం ఎంతవరకు సౌకర్యవం తంగా ఉందో సమీక్షించాల్సిన అవసరంకనిపిస్తోంది. పాలక మండలి బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండేళ్లు కావస్తున్న సమయంలో దర్శన వ్యవస్థలో గణనీయమైన మార్పులు ఆశించిన స్థాయిలో కనిపించలేదనే భావన వ్యక్తమవుతోంది. ఒక గంటలో ఉచిత దర్శనం అనే భావన ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, అనేక సందర్భాల్లో క్యూలైన్లలో వేచిచూసే సమయం ఎక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా రద్దీ రోజుల్లో భక్తులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఇది చిన్న పిల్లలతో, వృద్ధులతో వచ్చే కుటుంబాలకు కష్టసాధ్యంగా మారుతోంది. ఉచిత దర్శనం అందరికీ సమాన అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ, ప్రాక్టికల్ అమలులో మరింత సమన్వయం అవసరం అనిపిస్తోంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మూడు నెలలముందుగానే ఆన్లైన్లో విడుదలవుతున్నాయి. డిజిటల్ విధానం వేగవంతమైనదే అయినప్పటికీ, విడుదలైన కొద్దిసమయంలోనే టికెట్లు పూర్త వుతున్నాయి. దీనివల్ల అనేక మంది భక్తులు బుకింగ్ పొంద లేక నిరాశ చెందుతున్నారు.
Read Also : http://Andhra Pradesh: రాజాం పైడితల్లి అమ్మవారి జాతర రాష్ట్ర పండుగగా ప్రకటింపు
గ్రామీణ ప్రాంతాల భక్తులకు, సాంకేతిక పరిజ్ఞానం లేనివారికి ఇది ఒక సవాలుగా మారు తోంది. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను మరింత సులభతరం చేసి, సమాన అవకాశాలు కల్పించే విధంగా అదనపు స్లాట్లు లేదా పరిమిత ఆఫ్లైన్ కోటాలను పరిశీలించడం సముచితం. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా కూడా పూర్తిగా ఆన్ లైన్క పరిమితమవడంతో, అందరికీ సమానంగా అందుతోందా అన్న అంశం విశ్లేషణకు అవసరం. కోటా విడుద లైన వెంటనే పూర్తవుతుండటంతో అనేక కుటుంబాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వస్తోంది. భౌతి కంగా కొండపై పరిమిత టోకెన్లు ఇవ్వడం, లేదా జిల్లా కేంద్రాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చు. సిఫార్సు దర్శనాలు, విఐపీ కోటాలు కూడా సమతుల్యంగా నిర్వహించాల్సిన అంశాలుగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, దాతలకు ప్రత్యేక సదుపాయాలు ఉండటం పరిపాలనా పరంగా సాధారణమే. అయితే రోజువారీగా కోటాల వివరా లు, వినియోగ శాతం వంటి సమాచారం పారదర్శకంగా అందిస్తే అపోహలు తగ్గుతాయి. దర్శన వ్యవస్థలో సమా నత్వం అనేభావన బలపడటానికి ఇది అవసరం. జిల్లా కేంద్రాల్లో ఒకప్పుడు పనిచేసిన ఈదర్శన్ కౌంటర్లు ఇంకా పునఃప్రారంభం కాలేదు. భక్తులు తమప్రాంతాల్లోనే టోకెన్లు పొందే అవకాశాన్ని పునరుద్ధరించడం ద్వారా డిజిటల్ డివైడ్ తగ్గించవచ్చు. ప్రతి జిల్లాలో కనీసం ఒక అధికారిక బుకింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తే గ్రామీణ, పేదభక్తులకు సౌలభ్యం కలుగుతుంది. వేసవి సెలవులు, పర్వదినాల సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఈరద్దీని ముందు గానే అంచనా వేసి, టైమ్ స్లాట్లను పెంచడం, వసతి సామ ర్థ్యాన్ని తాత్కాలికంగా విస్తరించడం, ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడం వంటి చర్యలు అవసరం. డేటా ఆధారిత ప్రణాళికలతో ముందస్తు ఏర్పాట్లు చేస్తే క్యూలైన్లలో ఒత్తిడి తగ్గించవచ్చు. గత ఏడాదిన్నర కాలంలో ముగ్గురు ఈవోలు మారడం పరిపాలనా స్థిరత్వంపై ప్రభావం చూపిందనే అభి ప్రాయం వినిపిస్తోంది. ఒక విశాల ఆధ్యాత్మిక సంస్థలో దీర్ఘకాల ప్రణాళికలు అమలు కావాలంటే స్థిరమైన నాయకత్వం అవ సరం. ప్రతి అధికారి ప్రారంభించిన సంస్కరణలు పూర్తి స్థాయిలో అమలుకావాలంటే నిరంతర కొనసాగింపు అవస రం. భక్తుల సౌకర్యాల కోసం రూపొందించిన ప్రణాళికలు మధ్యలో నిలిచిపోకుండా నిరంతరపర్యవేక్షణ ఉండాలి. ఉచిత దర్శనానికి టైమ్ స్లాట్ టోకెన్ విధానాన్ని విస్తరించడం, ప్రత్యే క దర్శనస్లాట్లను అవసరానికి అనుగుణంగా సర్దుబాటుచేయ డం, ఆన్లైన్ వ్యవస్థను మరింత వినియోగదారుల స్నేహ పూర్వకంగా మార్చడం వంటి చర్యలు తీసుకోవచ్చు.
-అప్పన్న గొనప
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: