Kavitha: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతకు గురైన పేదల పక్షాన తాము చేసిన పోరాటం ప్రభుత్వ మెడలు వంచిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అరాచక పాలనపై ప్రజలు తిరగబడితే విజయం ఖాయమని వెలుగుమట్ల ఘటన నిరూపించిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
Read Also: Gig workers : గిగ్ వర్కర్లకు తెలంగాణలో కొత్త చట్టం

సగం మందికే పట్టాలా? కవిత ప్రశ్న
వెలుగుమట్లలో సుమారు 750 మంది పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసిందని, అయితే వారిలో కేవలం 411 మందికి మాత్రమే పట్టాలు ఇస్తామని ప్రకటించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగిలిన వారిలో తమకు అన్యాయం జరిగిందనే భావన నెలకొందని అన్నారు.పట్టాల పంపిణీలో పారదర్శకత ఉండాలని, ప్రతి బాధితుడికి న్యాయం జరగాలనే లక్ష్యంగా వెలుగుమట్ల బాధితుల కోసం తాము నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు.
రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీలో ఆర్మీ మాజీ అధికారి, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు భాగస్వాములు అయ్యారని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని కవిత అన్నారు. ఈ నిజనిర్ధారణ కమిటీకి ప్రభుత్వం, అధికారులు పూర్తిగా సహకరించాలని ఆమె డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: