తెలంగాణను ‘రైతు రాష్ట్రం’గా అభివర్ణించుకోవడం కొత్త విషయం కాదు. వ్యవసాయానికి అనుకూలంగా సాగు నీటి ప్రాజెక్టులు, పెట్టుబడి సబ్సిడీలు, పంట మద్దతుధరల వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పు కుంటుంది. కానీ ఈ చర్చల్లో ఒకవర్గం తరచుగా కనపడ కుండా పోతుంది కౌలు రైతులు. భూమి యజమాన్యం లేకపోయినా, భూమిని కౌలుకు తీసుకుని పంట పండించే ఈ రైతులే వాస్తవానికి వ్యవసాయ వ్యవస్థకు వెన్నెముక. అయినప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కౌలు వ్యవసాయం జరుగుతోంది. చిన్నచిన్న భూస్వాములు నగరాలకు వలస వెళ్తూ, తమ భూములను సాగు చేయడానికి ఇతరులకు కౌలుకు ఇస్తున్నారు. సాగు బాధ్యతను మోసేది కౌలు రైతే (Tenant farmer)అయినా, భూమి పత్రాలు మాత్రం యజమాని పేరులోనే ఉంటాయి. ఈపరిస్థితి ప్రభు త్వ పథకాల అమలులో ప్రధాన అడ్డంకిగా
మారుతోంది. ఉదాహరణకు రైతుబంధు పథకం రైతులకు పెట్టుబడి మద్దతు అందించడానికి రూపొందించ బడింది. కానీ ఈ సాయం భూమి యజమాని పేరుమీద ఆధారపడి ఉంటుం ది. కౌలు రైతు పంటకు ఖర్చు పెట్టినా, ఆర్థిక సహాయం మాత్రం భూమి యజమానికి చేరుతుంది. చాలా సందర్భాల్లో యజమానులు ఆ మొత్తాన్ని కౌలు రైతుకు ఇవ్వరు. ఈ విధంగా పథకం లక్ష్యం కౌలు రైతుల(Tenant farmer) వద్ద ఆగిపోకుండా మార్గం మళ్లుతోంది. అలాగే రైతు బీమావంటి జీవిత బీమా పథకాలు కూడా భూమి యజమానులకే పరిమితం అవుతున్నాయి. పంట విఫలమై అప్పుల బారిన పడి, ఆర్థిక ఒత్తిడితో ప్రాణాలు కోల్పోయే వారు చాలాసార్లు కౌలు రైతులే. కానీ పరిహారం అందే సమయంలో భూమి పత్రా లు అడగడం వల్ల వారి కుటుంబాలు న్యాయం కోల్పోతున్నాయి. కౌలు రైతుల ప్రధాన సమస్య అధికారిక గుర్తింపు లేకపోవడం. ఎక్కువగా కౌలు ఒప్పందాలు మోఖికంగానే ఉంటాయి.
Read Also : Bengaluru cafe incident: యుద్ధం ఎఫెక్ట్.. నిమ్మరసానికి గ్యాస్ బిల్ ఏంట్రా బాబూ?
భూమి యజమానులు రాతపూర్వక ఒప్పందా లకు ముందుకు రావడం అరుదు. భవిష్యత్తులో యాజ మాన్య హక్కులపై సమస్యలు తలెత్తుతాయనే భయంతో వారు ఒప్పందాలను నమోదు చేయరు. దీనివల్ల కౌలు రైతుకు చట్టపరమైన రక్షణ ఉండదు. పంట నాటిన తరు వాత కూడా భూమి కోల్పోయేప్రమాదం ఉంటుంది. బ్యాంకురుణాల విషయంలోనూ ఇదే పరిస్థితి. భూమి పాస్బుక్ లేకుండా వ్యవసాయ రుణం పొందడం కష్టం. ఫలితంగా కౌలు రైతులు అధిక వడ్డీకి ప్రైవేట్అప్పులపై ఆధారపడుతు న్నారు. పంట నష్టపోతే అప్పు చెల్లించడం అసాధ్యమవు తుంది. ఈ ఆర్థిక అస్థిరత గ్రామీణ సమాజంలో తీవ్రమైన సమస్యలకు దారితీస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టినప్పటికీ, కౌలురైతుల కోసం ప్రత్యేక చట్టబద్ధ వ్యవస్థ ఇంకా అవసరం. సాగుచేసే వ్యక్తిని గుర్తించి, అతనికి నేరుగా ప్రయోజనాలు అందే విధం గా విధానాలు రూపుదిద్దుకోవాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి, బ్యాంకు రుణాలు, పంటబీమా, సబ్సి డీలు అందేలా చేయాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్ లేదా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి కార్యక్రమాల్లో కూడా సాగు చేసే రైతును లబ్ధిదారుడిగా గుర్తించే మార్పులు అవసరం. ఇదొక కీలక అంశం సామా జిక భద్రత. కౌలు రైతుల కోసం ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, వృద్ధాప్య పింఛన్ వంటి రక్షణ చర్యలు అమలు చేయాలి. గ్రామ స్థాయిలో రైతు సంఘాలను బలోపేతం చేసి, కౌలురైతులను సంఘటితం చేయడం కూడా సమయో చితం. వారు సంఘటితంగా ఉంటేనే తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురాగలరు. తెలంగాణలో వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే, పంటను నిజంగా పండించే రైతు బలపడాలి. భూమియజమాని మాత్రమే రైతుకాదని, భూమి ని చెమటోడ్చి సాగు చేసే కౌలురైతేఅసలైన కృషికుడని గుర్తించాల్సిన సమయం వచ్చింది. సంక్షేమ పథకాలు కేవలం పత్రాల ఆధారంగా కాకుండా, భూమిపై కష్టపడే చేతులను గుర్తించే విధంగామారాలి. కౌలు రైతుల సమస్యలను పట్టించుకోకుండా ‘రైతు రాజ్యం’ అనేనినాదం అసంపూర్ణమే. తెలంగాణలో వ్యవసాయ రంగం స్థిరంగా ఉండాలంటే, కౌలు రైతులకు చట్టబద్ధ రక్షణ, ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం కల్పించాలి. అదే నిజమైన రైతు సంక్షేమం. అదే తెలంగాణ వ్యవసాయ భవి ష్యత్తుకు బలమైన పునాది.
-తిప్పర్తి శ్రీనివాస్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: