📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు

Author Icon By Anusha
Updated: February 11, 2026 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కొడంగల్ లో ఓటు వేశారు. వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ జడ్పీ హైస్కూల్‌ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరిగి బయల్దేరారు. కాసేపట్లో ఆయన శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని ఢిల్లీకి వెళతారని సమాచారం.

Read Also: Fertilizer App: యూరియా యాప్ తో యాతన

సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది

(Telangana) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో ఓటేశారు. నిజామాబాద్ పట్టణంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ పట్టణంలో ఓటేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధాన్ని కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకోవాలని బండి సంజయ్ కోరారు.

మంచిర్యాలలోని హైటెక్‌సిటీలో 227వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఓటు వేశారు. కామారెడ్డి పట్టణంలోని 151 పోలింగ్ బూత్ లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Revanth Reddy Telangana Municipal Elections Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.