📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Technology : సాంకేతికత జోడిస్తేనే రైతుకు మేలు..

Author Icon By Sudha
Updated: March 3, 2026 • 4:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం గత దశాబ్దంలో గణ నీయంగా పెరిగింది. 2014-15లో సుమారు 22.7 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సాగు, 2023-24 నాటికి దాదాపు 66 లక్షల ఎకరాలకు చేరింది. ఇది ఆహార భద్రత దృష్ట్యా ఒక విజయగాథలా కనిపించినప్పటికీ, దీని వెనుక ఒక తీవ్రమైన పర్యావరణ, ఆర్థిక సంక్షోభం దాగి ఉంది. నిరంతర ఏకపంట సాగు, అధిక రసాయన ఎరువుల విని యోగం, అధిక నీటిపారుదల కారణంగా నేల- సేంద్రీయ కార్బన్
తగ్గుదల, సూక్ష్మజీవుల వైవిధ్య క్షీణత, నేల ఆమ్లత్వం పెరుగుదల వంటి సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. తెలం గాణ జనాభాలో సుమారు 61 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. అయితే పెరుగుతున్న సాగు ఖర్చులు, రసాయనాలపై అధిక ఆధారపడటం, దిగుబడుల్లో స్థిరత్వం లేకపోవడం రైతులను అప్పుల బారిన పడేలా చేస్తోంది. భూగర్భ జలాలపై అధిక ఒత్తిడి వల్ల వరిసాగు మరింత వాతావరణ మార్పులకు లోనవుతోంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం లాభదాయక వృత్తిగా కనిపించక యువత దూరమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఖరీఫ్ 2025లో అమలు చేసిన పునరుత్పాదక వరి సాగు పైలట్ ప్రాజెక్ట్ ఒక మార్గదర్శక ప్రయోగంగా నిలిచింది. సిద్ధిపేట జిల్లా పెద్ద మాసంపల్లి, ఇబ్రహీంపూర్ గ్రామాలు రాజన్న-సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రాంతాల్లో 10 మంది రైతులతో 10ఎకరాల్లో అమలు చేసిన ఈప్రాజెక్ట్, నేల పున రుద్ధరణ ఖర్చు తగ్గింపు-నీటి సంరక్షణ అనే మూడు ముఖ్య లక్ష్యాలపై దృష్టి పెట్టింది. 19 రకాల పచ్చ, ఎరువు, పంటలతో రూపొందించిన బహుళ పంట వ్యవస్థ ఈ మోడల్లో కీలక భాగం.

Read Also : Women’s Day Celebrations: ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

Technology

ధాన్యాలు, పప్పులు, చిరుధాన్యాలు, నూనె గింజలు, ఆకుకూరలు, ధైనా, సన్హెంప్ వంటి పంటలను 45-60 రోజులు పెంచి పుష్ప దశలో నేలలో కలపడం ద్వారా ఎకరాకు సుమారు 2.3 టన్నుల బయోమాస్ ఉత్ప త్తి అవుతుంది. దీనివల్ల నేలలో రంధ్రాల నిర్మాణం మెరుగు పడి తేమ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా రైజో స్పియర్ ప్రాంతంలో సూక్ష్మజీవుల పెరుగుదల 2-3 రెట్లు పెరిగినట్టు ప్రయోగశాల పరీక్షలు వెల్లడించాయి. రసాయన ఎరువులు, పురుగుమందులను పూర్తిగా మానేసి, స్థానికంగా తయారు చేసిన జీవ ద్రావణాలతో సాగు చేయడం వల్ల సాగు ఖర్చుగణనీయంగా తగ్గుతుంది. ఎకరాకు రూ. 4,000 – రూ. 8,000 వరకు మొత్తం ఖర్చు తగ్గగా, రైతుల నికర ఆదాయం రూ. 6,000 – రూ.12,000 వరకు పెరిగినట్టు నమోదు అయింది. నీటిపారుదల చక్రాలు 28-30 సార్ల నుంచి 22 సార్లకు తగ్గి 20-25శాతం నీటిఆదా సాధ్యమైంది. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత డిజిటల్ సాంకేతికతల(Technology) వినియోగంలో ఉంది. ఉపగ్రహ ఆధారిత పంట ఆరోగ్య పర్యవేక్షణ, 3.3 మీటర్ల స్థాయిలో ఫీల్డ్ విశ్లేషణ, ఏఐ ఆధారిత వ్యాధి ముందస్తు హెచ్చరికలు రైతులకు అందించబడ్డాయి. దీనివల్ల 7-10 రోజుల ముందే పంటఒత్తిడి, వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు తీసుకునేఅవకాశం లభించింది. ఖచ్చిత నీటి పారు దల సలహాల వల్ల నీటివినియోగం మరింత సమర్థవంత మైంది. ఈ పైలట్ ఫలితాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. నేల ఆరోగ్యం పునరుద్ధరణ లేకుండా వ్యవసాయ సుస్థిరత సాధ్యంకాదు. పునరుత్పాదక వ్యవసాయం కేవలం రసాయనరహిత సాగు మాత్రమేకాదు, అది నేల జీవ వైవి ధ్యాన్నిపెంచే, నీటి వినియోగాన్ని తగ్గించే, రైతు ఆదాయాన్ని స్థిరపరచే సమగ్రవిధానం. తెలంగాణలో వరి ఉత్పత్తి పెరు గుదలతో పాటు పర్యావరణ సమతౌల్యం కాపాడాలంటే ఈతరహా మోడళ్లను క్లస్టర్ స్థాయిలో విస్తరించడం అవసరం. సిఎస్ఆర్ భాగస్వామ్యాలు, ప్రభుత్వమద్దతు, వ్యవ సాయశాఖ సాంకేతిక (Technology) సహకారం ఉంటే ఈ మోడల్ రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉంది. అధిక ఉత్పత్తి లక్ష్యాల నుంచి సుస్థిర ఉత్పత్తి లక్ష్యాల వైపు అడుగులు వేయాల్సి నసమయం వచ్చింది. నేలను కాపాడితేనే రైతు బతుకుతాడు, రైతుబతికి తేనే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలపడుతుంది. తెలంగాణ వరి సాగుభవిష్యత్తు పునరుత్పాదక మార్గంలోనే సురక్షితం.
-ఈ. శ్రీనివాస్ రావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Agricultural Technology Breaking News Digital agriculture farmer welfare latest news smart farming Technology Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.