26/11 ముంబయి ఉగ్రదాడులు ప్రధాన సూత్రధారి తహవూర్ రాణా(Tahawwur Rana) పౌరసత్వం రద్దుకు కెనడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆ దేశ ప్రధాన మంత్రి మార్క్ కార్నీ భారత పర్యటనకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జస్టిన్ ట్రూడో హయాంలో భారత్‌తో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరించే ప్రయత్నాల్లో కెనడా ఉంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 25న కార్నీ భారత్ పర్యటనకు విచ్చేస్తున్నారు. పాకిస్థాన్‌లో జన్మించిన వ్యాపారవేత్త తహవూర్ రాణా ప్రస్తుతం భారత కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో గతేడాది అతడ్ని ట్రంప్ ప్రభుత్వం అప్పగించింది. ముంబయిలో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా మారణహోమం వెనుక రాణా హస్తం ఉన్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నవంబరు 26, 2008న జరిగిన ఉగ్రదాడిలో 160 మందికి పైగా మృతి చెందారు.
Read Also: PM Modi : ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!
1997లో కెనడాకు వలస వెళ్లాడు, 2001లో అక్కడి పౌరసత్వం
పాకిస్థాన్‌లో జన్మించిన తహవ్వుర్ రాణా వృత్తిరీత్యా వ్యాపారవేత్త. 1997లో కెనడాకు వలస వెళ్లాడు. 2001లో అక్కడి పౌరసత్వం పొందాడు. కెనడాలో ఉన్నా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు కొనసాగించాడు. 26/11 ముంబయి దాడుల సమయంలో ఉగ్రవాదులకు అవసరమైన మౌలిక వసతులు, ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్లు, దాడులకు సంబంధించిన రెక్కీ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. రాణాకు అమెరికా, కెనడా దేశాల పౌరసత్వాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కెనడా ప్రభుత్వం రాణా పౌరసత్వాన్ని ఉగ్రవాద ఆరోపణల కారణంగా రద్దు చేయడం లేదు. అతను పౌరసత్వం పొందే క్రమంలో చేసిన ‘వంచన’ ఆధారంగా రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. 2000వ సంవత్సరంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, రాణా తాను కెనడాలోని ఒట్టావా, టొరంటో నగరాల్లో నాలుగేళ్లు నివసించినట్లు పేర్కొన్నాడు.
గత ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో భారత్-కెనడా సంబంధాలు అత్యంత పతన స్థాయికి పడిపోయాయి. ఖలిస్థానీ అనుకూల అంశాల వల్ల ఏర్పడిన విబేధాలను తొలగించి, సంబంధాలను మళ్లీ పునరుద్ధరించాలని ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 26న కార్నీ దిల్లీకి వస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: