📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Trump: సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

Author Icon By Vanipushpa
Updated: February 21, 2026 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా సుప్రీంకోర్టులో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి విదితమే. డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన సుంకాల పెంపు విధానాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఆ ఉత్తర్వులన్నింటినీ రద్దు చేసింది. దీంతో ప్రపంచ దేశాలు కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. అయితే డొనాల్డ్ ట్రంప్ (Trump) మరోసారి భారత్ మీద బాంబును పేల్చాడు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. Powered By 1999 లో సర్వీస్ లోకి వచ్చా.. 20 ఏళ్లు పట్టింది గెజిటెడ్ అవ్వడానికి | Oneindia Telugu భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు నిర్ణయం గ్లోబల్ టారిఫ్ విధానానికి మాత్రమే వర్తిస్తుందని.. భారత్‌కు సంబంధించి ఇప్పటికే నిర్ణయించిన వాణిజ్య నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇండియా-యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందంలో ఏమీ మారదు.

Read Also: Chandrababu : ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ గా చంద్రబాబే ఉండాల్సింది – భూమన ఎద్దేవా

Even after the Supreme Court’s ruling, tariffs on India will continue.

రెండు దేశాల మధ్య చర్చించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం

భారత్ టారిఫ్‌లు చెల్లిస్తూనే ఉంటుంది. మేము మాత్రం టారిఫ్‌లు చెల్లించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారత్‌కు సంబంధించిన వాణిజ్య విధానంలో అమెరికా వెనక్కి తగ్గబోతోందనే అంచనాలకు తావులేకుండా చేశాయి. రెండు దేశాల మధ్య చర్చించిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం మేరకు భారత వస్తువులపై సుమారు 18 శాతం టారిఫ్‌లు కొనసాగుతాయి. మరోవైపు అమెరికా ఉత్పత్తులపై భారత్ నుంచి పెద్దగా టారిఫ్ భారం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒప్పందం భారత ఎగుమతిదారులకు కొంత భారం అయినప్పటికీ.. అమెరికా మార్కెట్‌లో ప్రవేశానికి ఇది ఒక అవకాశంగా కూడా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ట్రంప్ పరిపాలన విధించిన గ్లోబల్, పరస్పర టారిఫ్‌లు చట్టానికి విరుద్ధమని తీర్పు ఇచ్చింది. 1977లో రూపొందించిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) ఆధారంగా ఇంత విస్తృతంగా టారిఫ్‌లు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అధిక టారిఫ్‌లను తగ్గించి 18 శాతానికి పరిమితం

ఈ తీర్పుతో ట్రంప్ పరిపాలన అమలు చేసిన కొన్ని ప్రధాన టారిఫ్ విధానాలు రద్దయ్యాయి. మోదీ దూకుడు దెబ్బకు దిగొచ్చిన ట్రంప్.. భారత వస్తువులపై 50 నుండి 18 శాతానికి సుంకాలు తగ్గింపు.. ఈ నిర్ణయంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పు దేశ ఆర్థిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని ఆయన విమర్శించారు. అదే సమయంలో మరో చట్టం అయిన Section 122 ఆధారంగా 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కూడా వెల్లడించారు. దీని ద్వారా కోర్టు తీర్పు తర్వాత కూడా టారిఫ్ విధానాన్ని కొనసాగించే ప్రయత్నాలు చేస్తామని సంకేతాలు ఇచ్చారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యాన్ని చూస్తే.. ఇటీవల ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చర్చల్లో ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై అవగాహన కుదిరినట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా విధిస్తున్న 25 శాతం వరకు ఉన్న అధిక టారిఫ్‌లను తగ్గించి 18 శాతానికి పరిమితం చేసింది. దీనికి ప్రతిగా భారత్ కూడా తన ఉత్పత్తులపై అదే స్థాయి టారిఫ్‌లు చెల్లించేందుకు అంగీకరించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Customs Tariffs economic impact import duties legal verdict Supreme Court ruling Tariffs on India Telugu News Paper Telugu News Today Trade Relations US-India Trade

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.