కేరళలోని శబరిమల ఆలయంతో సహా పలు మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విచారించేందుకు తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విచారణను ధర్మాసనం ఏప్రిల్ 7న ప్రారంభిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమల్య బాగ్చి, విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం చెప్పింది. ఇది ఏప్రిల్ 22 నాటికి ముగిసే అవకాశం ఉందని పేర్కొంది. మహిళల ప్రవేశంపై నిషేధానికి సంబంధించి మార్చి 14లోపు లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆలయ నిర్వాహకులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: ViksitBharat2047: వాణిజ్య ఒప్పందాలతో కొత్త ఆర్థిక యుగం
మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం లేకపోవడంపై పరిగణనలోకి
శబరిమలతో పాటు మసీదులు, దర్గాలోకి మహిళల ప్రవేశంపై కూడా విచారించనుంది. అలాగే ఇతరులను పెళ్లి చేసుకున్న పార్సీ మహిళలకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం లేకపోవండ వంటి అంశాలపై పరిగణనలోకి తీసుకుంది. అయితే నిర్ణయించిన షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలని అన్ని పక్షాలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. 2019లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే ఏర్పాటు చేసిన 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం సమీక్ష పిటిషన్ల నిర్వహణను ఇప్పటికే నిర్ణయించిందని తెలిపారు. అయితే కొవిడ్ కారణంగా ఈ అంశంపై విచారణలను అకస్మాత్తుగా రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మరో కొత్త ధర్మాసనంతో దీనిపై విచారణ జరపనున్నట్లు వెల్లడించారు. 2018 శబరిమల తీర్పు సమీక్షించాలనే మద్దతుదారుల తరఫున నోడల్ న్యాయవాదిగా కృష్ణ కుమార్ సింగ్‌ను, వ్యతిరేక పక్షాల తరఫున శాశ్వతి పారిని ధర్మాసనం నియమించింది. అమికస్ కురియేగా సీనియర్ అడ్వకేట్ కే పరమేశ్వర్, సహాయకుడిగా శివం సింగ్ నియమితులయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: