Supreme Court: న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం ..సుప్రీంకోర్టు మండిపాటు

Read Time:  1 min
న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం ..సుప్రీంకోర్టు మండిపాటు
న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం ..సుప్రీంకోర్టు మండిపాటు
FONT SIZE
GET APP

జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం చేర్చడాన్ని సుప్రీంకోర్టు(Supreme Court)మండిపడింది. దీని వెనుక న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర కనిపిస్తుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం విచారణ కొనసాగించింది.ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. మీరు ప్రయోగించిన బుల్లెట్‌తో న్యాయవ్యవస్థ రక్తమోడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Petrol : ఏప్రిల్ నుంచి కొత్త పెట్రోల్ రూల్

 Lesson on corruption in the judicial system..Supreme Court's ire
Lesson on corruption in the judicial system..Supreme Court’s ire

విశ్వసనీయత దెబ్బతినే అవకాశం

న్యాయవ్యవస్థ అధికారాన్ని అణచివేసేలా, గౌరవాన్ని కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా ఎన్సీఆర్టీ నిర్ణయం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారాన్ని ఇలాగే వదిలేస్తే ప్రజలు, యువత మనసుల్లో న్యాయవ్యవస్థ పటిష్టత, విశ్వసనీయత దెబ్బతినే అవకాశం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతిని వివరించేందుకు ఒక పూర్తి అధ్యాయాన్ని కేటాయించిన ఎన్సీఆర్టీ…అదే సమయంలో కోర్టుల విశిష్ట చరిత్రను మాత్రం విస్మరించిందని చురకలేశారు. జవాబుదారీతనం ఏర్పడే వరకు ఈ వ్యవహారాన్ని మేము వదిలిపెట్టబోమన్నారు. దీనికి వెనక ఎవరు ఉన్నారో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోర్టు ఐదు ఆదేశాలు జారీ చేసింది. వాటిని అతిక్రమిస్తే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్‌సీఈఆర్‌టీ వివాదాస్పద పుస్తకంపై నిషేధం విధించిందని, ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తే.. కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఆ సంస్థ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.