📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Software Engineer Sunitha: టెక్కీ సునీత మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు

Author Icon By Anusha
Updated: February 20, 2026 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Software Engineer Sunitha: నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సునీత హత్య కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది ఆవేశంలో చేసిన హత్య కాదని, గత రెండు నెలలుగా ఆమె మాజీ భర్త మహేశ్, పక్కా ప్రణాళిక సిద్ధం చేసి, అత్యంత కిరాతకంగా అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణ ప్రకారం కెనడాలో ఉద్యోగం కోల్పోవడం, సునీత పెట్టిన కేసుల వల్ల తిరిగి అక్కడికి వెళ్లలేకపోవడంతో మహేశ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. సునీత ఆచూకీ తెలుసుకోవడానికి ఆమె సోషల్ మీడియా ఖాతాలపై దృష్టి పెట్టాడు.

Read Also: Bandi Sanjay: మంత్రుల అవినీతి చిట్టా బయటపెడతా

సోషల్ మీడియాలో వేట – రీల్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో అడ్రస్ గుర్తింపు

ఆమె పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను నిశితంగా పరిశీలించి, వీడియోల బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించిన పరిసరాల ఆధారంగా వనస్థలిపురంలోని కాప్రాయి చెరువు సమీపంలో ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను గుర్తించాడు.హత్యకు వెళ్లే ముందు మహేశ్ యుద్ధానికి సిద్ధమైనట్లుగా సామగ్రిని సమకూర్చుకోవడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఆమె తలుపులు వేసుకుంటే కోసేందుకు గ్రైండర్ కట్టర్, ప్రతిఘటించకుండా కళ్లలో కొట్టేందుకు పెప్పర్ స్ప్రే, దాడి చేసేందుకు పదునైన కత్తులు వెంట తెచ్చుకున్నాడు.

sunitha-software-engineer-murder-case-mysterious-facts

హత్య తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. సుమారు 60 రోజులు తుర్కయాంజిల్‌లోని ఓ హాస్టల్‌లో ఉండి నాలుగు రోజులు సునీత కదలికలపై రెక్కీ నిర్వహించాడు. సరైన సమయం చూసి, వాచ్‌మన్ లేని వేళ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాను చేసిన నేరానికి ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఏ శిక్షకైనా సిద్ధమని మహేశ్ పోలీసుల ఎదుట చెప్పినట్లు సమాచారం.సునీత రెండో భర్త శ్రీనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మహేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.  

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

crime news Telugu Hyderabad Crime News latest news Software Engineer Sunitha Murder Techie Murder Mystery Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.