📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Andhra pradesh: ఐపిఎస్ అధికారి సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు

Author Icon By Rajitha
Updated: March 3, 2026 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

5వ తేదీలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశం

విజయవాడ : ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడి యల్ టార్చర్ వ్యవహారంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ముందు హాజరు కావాలని బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ను హైకోర్టు ఆదేశించింది. మార్చి 5వ తేదీ లేదా అంతకంటే ముందు దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని జారీ చేసిన ఆ ఆదేశాల్లో నాయక్కు హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి కఠిన చర్యలకు పాల్పడకుండా చట్టంలోని నిబంధనలను లోబడి సునీల్ కుమార్ నాయక్ను విచారించాలని దర్యాప్తు అధికారికి ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు సూచించింది. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

Read also: Tamil Nadu Elections: తమిళనాడులో డీఎంకే తరపున రోజా ప్రచారం?

IPS officer Sunil Nayak faces challenge in High Court

ఈ సందర్భంగా హైకోర్టు పై విధంగా స్పందించింది. ఇక మార్చి 9వ తేదీకి సునీల్ కుమార్ ప్రధాన బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా రాజకీయ కారణాలతో తన పిటిషనర్ను నిందితుడిగా చేర్చారంటూ సునీల్ తరఫు సీనియర్ న్యాయవాది పరమేశ్వర్ వాదనలు వినిపించారు. ఈ కస్టోడియల్ టార్చర్తో సునీల్ నాయక్కు సంబంధం లేదని కోర్టు దృష్టికి ఈ సందర్భంగా పరమేశ్వర్ తీసుకెళ్లారు. సునీల్ నాయక్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణ అర్హత లేదని పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్ద్ లూథ్రా కోర్టుకు వివరించారు.

అలాగే సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ ను గుంటూరు కోర్టు గతంలో కొట్టి వేసిందంటూ హైకోర్టు దృష్టికి సిద్ధార్థ్ లూథ్రా తీసుకెళ్లారు. పోలీసుల మొదట నమోదు చేసిన ఎఫ్ఎఆర్ పేరు లేదనే కారణంతో పిటిషనర్ దర్యాప్తు నుంచి తప్పించుకోలేరని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఎఫ్ఎఆర్లో అందరి నిందితుల పేర్లు చేర్చాల్సిన అవసరం లేదని.. ఈ కేసు దర్యాప్తు సాగుతున్నకొద్ది మరికొంతమంది నిందితులను చేర్చే అవకాశం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తునకు సహకరించాల్సిన చట్టబద్దమైన విధి పిటిషనర్ కు ఉందని హైకోర్టు తెలిపింది. ఈ కేసు విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP High Court verdict IPS Officer Case latest news RRR Case Sunil Kumar Nayak Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.