📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Singapore: అత్యాచారం కేసులో సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి 12 ఏళ్ల జైలుశిక్ష

Author Icon By Vanipushpa
Updated: February 27, 2026 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి.. తనను తాను పోలీసులుగా చెప్పుకొని, ఓ మహిళకు సాయం చేస్తానంటూ నమ్మించి మోసం చేశాడు. ముఖ్యంగా సింగపూర్‌లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే నేరం రుజువు కావడంతో.. సింగపూర్(Singapore) కోర్టు అతడికి కఠిన శిక్ష విధించింది. ముఖ్యంగా 12 ఏళ్ల జైలుశిక్షతో పాటు 12 కొరడా దెబ్బల శిక్షను ఖరారు చేసింది.

Read Also: IDFC Bank Scam: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కుంభకోణం

Indian-origin man sentenced to 12 years in prison in Singapore for rape

పోలీసు అధికారిగా నాటకం

2022 జూలై 11న రాత్రి 8 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. ఇండోనేషియాకు చెందిన 35 ఏళ్ల మహిళ తన స్నేహితులతో కలిసి సింగపూర్‌లోని లిటిల్ ఇండియా మెట్రో స్టేషన్ సమీపంలో వేచి చూస్తోంది. అప్పుడే అక్కడకు భారత సంతతికి చెందిన మలేషియ వ్యక్తి 48 ఏళ్ల షర్వీన్ శెట్టి వెళ్లి.. తనను తాను ఓ పోలీసు అధికారి పరిచయం చేసుకున్నాడు. ఇతడి మాటలు నమ్మిన ఆమె.. తన వద్ద ఏదో తనిఖీ చేయాలని నాటకమాడాడు. అలా ఆమెను తన స్నేహితులకు దూరంగా.. మెట్రో స్టేషన్ ఎగ్జిట్ ఎఫ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆపై అక్కడే ఉన్న పొదల్లో ఆమెపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షర్వీన్ శెట్టిని అరెస్టు చేసి ఫిబ్రవరి 3వ తేదీన హైకోర్టులో హాజరు పరిచారు. అయితే మొదట్లో తాను నేరం చేయలేదని బుకాయించిన షర్వీన్ శెట్టి తన తప్పును అంగీకరించాడు. ఫలితంగా 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు సింగపూర్ చట్టాల ప్రకారం కఠినమైన 12 కొరడా దెబ్బలను శిక్షగా విధించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Caning Sentence Singapore Crime News Indian Origin Man Sentenced international law Singapore Court Judgment Singapore Rape Case Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.