📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Billing: షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌కు మొబైల్ నెంబర్ ఇవ్వాలా..?

Author Icon By Sudha
Updated: February 26, 2026 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏదైనా షాపింగ్ మాల్స్‌కి వెళ్లినప్పుడు బిల్ చెల్లించే సమయంలో మిమ్మల్ని సిబ్బంది మొబైల్ నెంబర్ అడుగుతూ ఉంటారు. కొంతమంది ఏమీ ఆలోచించకుండా నెంబర్ అందిస్తూ ఉంటారు. మరికొంతమంది ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఉంటారు. మీరు షాపింగ్ మాల్స్‌లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు బిల్లింగ్ (Billing)సమయంలో మీ ఫోన్ నెంబర్‌ను అడుగుతూ ఉంటారు. చాలామంది నెంబర్‌ను చెప్పేస్తూ ఉంటారు. మరికొంతమంది నెంబర్ ఎందుకని ప్రశ్నిస్తూ ఉంటారు. తప్పనిసరిగా నెంబర్ ఇవ్వాలేమోనని చాలామంది బిల్లింగ్ (Billing)చేసేటప్పుడు నెంబర్ అందిస్తూ ఉంటారు. అయితే ఖచ్చితంగా మీరు షాపింగ్ మాల్స్ బిల్లింగ్ సమయంలో నెంబర్ ఇవ్వాల్సిన పని లేదట. మీ అభిష్టం మేరకు అవసరమైతే ఇవ్వొచ్చు. మీకు ఇష్టం లేకపోతే ఇవ్వకుండా వదిలేయవచ్చు. తప్పనిసరిగా ఇవ్వాలనే నిబంధన ఎక్కడా లేదు. ఈ మేరకు చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

Read Also: Central Railway: హోలీ పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు


Billing

షాపింగ్ మాల్స్ లేదా షాపుల వద్ద మొబైల్ నెంబర్ ఇచ్చే అంశంపై నిబంధనలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై లోక్‌సభ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రివాల్ పార్లమెంట్‌లో ఓ ప్రశ్న అడిగారు. ఈ సందర్భంగా కేంద్రం సమాధానమిచ్చింది. ఖచ్చితంగా నెంబర్ ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదని చెప్పుకొచ్చింది. కస్టమర్ల ఇష్టం మేరకు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు రిటైలర్లకు మే 26,2023న సూచనలు జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది. బలవంతంగా కస్టమర్ల మొబైల్ నెంబర్ తీసుకోకూడదని సూచించినట్లు స్పష్టం చేసింది. డిజిటల్ పర్సనల్ డేటా యాక్ట్ 2023, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 ప్రకారం ప్రజల వ్యక్తిగత డేటా బలవంతంగా సేకరించకూడదని, వారి అనుమతి ప్రకారమే తీసుకోవాలని కేంద్రం పేర్కొంది. పౌరులు తమ వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయిందని గుర్తిస్తే కేంద్ర వినియోగ వ్యవహరాల శాఖ హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు చేయవచ్చని, దానికి అనుగుణంగా చర్యలు ఉంటాయాని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కస్టమర్ల మొబైల్ నెంబర్లను దుర్వినియోగం చేసే హక్కు ఎవరికి లేదని తెలిపింది. రిటైలర్లు అందరూ ఈ నిబంధనలు పాటించాలని కేంద్రం పేర్కొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

billing Breaking News latest news Mobile number personal data Privacy Shopping malls Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.