📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Numaish Exhibition: ఎగ్జిబిషన్ లో 264 మంది పోకిరీలకు బుద్ధి చెప్పిన షీటీమ్స్

Author Icon By Vanipushpa
Updated: February 25, 2026 • 1:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్‌’ (Numaish)లో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన 264 మంది పోకిరీలను గుర్తించి అదుపులో తీసుకున్న షీ టీమ్ పోలీస్ బృందం ప్రకటించింది. నుమాయిష్ సందర్శన పేరుతో మ‌హిళ‌లు, అమ్మాయిల‌ను తాకుతూ వేధించేందుకే వచ్చామన్నట్లుగా ప్రవర్తించిన పోకిరీలను ప‌ట్టుకునేందుకు షీ టీమ్స్ పోలీసులు సంద‌ర్శ‌కుల్లో క‌లిసిపోయి నిఘా పెట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ కొనసాగినన్ని రోజులు సాగించిన నిఘాలో 264 మంది పోకిరిలను షీటీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు.

Read Also: PM Modi Israel Visit: ఇజ్రాయెల్ కు బయలుదేరిన ప్రధాని మోదీ

The SHIT teams that taught wisdom to 264 hooligans at the exhibition

రూ.1050 కోర్టు జరిమానా

56 మందిపై కేసులు నమోదు చేయగా, 52 మందికి రూ.1050 కోర్టు జరిమానా విధించబడింది. నలుగురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. 188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వార్నింగ్ తో వదిలేసినట్లుగా షీటీమ్ విభాగం పేర్కొంది. జనవరి1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ విజయవంతంగా కొనసాగింది. దేశ నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతులు ఇక్కడ కొలువు దీరాయి. నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్య తరహా, మైక్రో ఇండస్ట్రీలకు సంబంధించిన ఉత్పత్తుల స్టాల్స్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన హస్తకళలు, దుస్తులు, కళాకృతుల ఉత్పత్తులకు చెందిన 1050 స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anti Harassment Drive Eve Teasing Case Hyderabad Exhibition Latest News in Telugu law enforcement action Public Safety SHE Teams telangana police Telugu News Paper women safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.