📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

China: షాక్స్‌గామ్‌ వ్యాలీపై ఇరు దేశాల మధ్య ముదురుతున్న వివాదం

Author Icon By Vanipushpa
Updated: January 14, 2026 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, చైనా మధ్య 2020లో గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణ తర్వాత సైనిక ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ఉద్రిక్తతలను తగ్గించడానికి దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది జరిగి ఏడాది గడవక ముందే చైనా మరో సరిహద్దు వివాదానికి తెరలేపింది. జమ్మూ కాశ్మీర్‌లోని వ్యూహాత్మక ప్రాంతమైన షాక్స్‌గామ్ వ్యాలీ (Shaxgam Valley)పై.. చైనా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. షాక్స్‌గామ్ వ్యాలీలో చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. వాటిని కపట డ్రాగన్ దేశం తోసిపుచ్చింది.అంతేకాకుండా.. షాక్స్‌గామ్ వ్యాలీలో చైనా రోడ్లు, ఇతర నిర్మాణ పనులను వేగవంతం చేస్తోంది. దీనిపై ఇటీవల భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది.

Read Also: Odisha: స్నాక్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలి కంటిచూపు కోల్పోయిన బాలుడు

China: షాక్స్‌గామ్‌ వ్యాలీపై ఇరు దేశాల మధ్య ముదురుతున్న వివాదం

పాకిస్తాన్, చైనా మధ్య సరిహద్దు ఒప్పందం

షాక్స్‌గామ్ వ్యాలీ గ్రేటర్ కాశ్మీర్ ప్రాంతంలోని సియాచిన్ గ్లేసియర్‌కు ఉత్తరాన ఉంది. 1963లో పాకిస్తాన్, చైనా మధ్య సరిహద్దు ఒప్పందం ద్వారా ఈ ప్రాంతం చైనాకు వెళ్లిపోయింది. భారత్ మాత్రం ఆ ఒప్పందాన్ని చట్టవిరుద్ధమైనదని, చెల్లదని పేర్కొంటూ ఎన్నడూ గుర్తించలేదు. అప్పటినుంచి ఈ ప్రాంతం వివాదాస్పదంగా ఉంది. ఇటీవల అక్కడ చైనా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడంతో మరోసారి వివాదం చెలరేగింది.

భారతదేశ రక్షణలో అత్యంత కీలకమైనది

షాక్స్‌గామ్ వ్యాలీ సియాచిన్ గ్లేసియర్ పక్కన ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మిలిటరీ ఫ్రంట్‌లైన్ పాయింట్. ఇది భారతదేశ రక్షణలో అత్యంత కీలకమైనది. అంతేకాకుండా షాక్స్‌గామ్ వ్యాలీ ఎత్తైన పర్వత మార్గాలు, లాజిస్టికల్ మార్గాలకు పక్కన ఉంది. క్లిష్ట సమయాల్లో కారకోరం ప్రాంతంలో సైన్యాన్ని మోహరించడానికి షాక్స్‌గామ్ వ్యాలీ కీలకంగా మారుతుంది. అయితే అఘిల్ పాస్ సమీపంలో చైనా రోడ్లు, మార్గాలు నిర్మిస్తోంది. వీటి ద్వారా చైనా తన బలగాలను.. సియాచిన్ సమీపంలోని భారత మిలిటరీ పాయింట్లకు దాదాపు 50 కి.మీ. దూరంలోకి తీసుకురాగలదని నిపుణులు చెబుతున్నారు. ఇలా జరిగితే సరిహద్దుల వెంట సెక్యూరిటీ బ్యాలన్స్‌ మారి.. భారత ఆధిపత్యం తగ్గుతుందని అంటున్నారు. అందుకే చైనా చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Border conflict Geopolitics India China Relations International Relations Pakistan China agreement Shaksgam Valley dispute Telugu News online Telugu News Today territorial dispute

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.