అమెరికాలో వ్యాపారం చేయాలనుకునే భారతీయులకు బిగ్ షాక్.. వ్యాపారాలపై ప్రభావం చూపే కీలక విధాన మార్పును అమెరికా స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (SBA) తాజాగా ప్రకటించింది.చిన్న వ్యాపార యజమానులకు రుణాల ద్వారా సపోర్ట్ ఇచ్చే ఈ ప్రభుత్వ సంస్థ.. ఫిబ్రవరి 2 (అమెరికా కాలమానం ప్రకారం) న కొత్త పాలసీ నోటీసును విడుదల చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన అమెరికా ఫస్ట్’ ఎజెండాను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ తాజా సవరణ ప్రకారం.. US పౌరులు కాని వారి యాజమాన్యంలో ఉన్న Business ఇకపై SBA రుణాలకు అర్హులు కావు. ఇందులో గ్రీన్ కార్డ్ హోల్డర్లు (చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు – LPRలు) కూడా ఉంటారు. ఇది ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానానికి పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం. ఈ కొత్త మార్గదర్శకాలు మార్చి 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.
Read Also: Trade Deal Impact: సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..
వ్యాపార వర్గాల్లో ఆందోళన
SBA నిర్వాహకురాలు కెల్లీ లోఫ్లర్ విడుదల చేసిన పాలసీ నోటీసులో.. చిన్న వ్యాపార దరఖాస్తుదారుని ప్రత్యక్ష లేదా పరోక్ష యజమానులలో 100 శాతం మంది US పౌరులు లేదా అమెరికాలో ప్రధాన నివాసం కలిగిన US జాతీయులే కావాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నోటీసుతో గతంలో అమల్లో ఉన్న SOP 50 10 8 విధానానికి సంబంధించిన పాత మార్గదర్శకాలు రద్దు అయ్యాయి. డిసెంబర్ 2025లో జారీ చేసిన నోటీసులో.. పరిమిత మినహాయింపుగా విదేశీ పౌరులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్లు గరిష్టంగా 5 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉండేందుకు అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు విడుదల చేసిన తాజా నోటీసులో.. LPRలు ఏ శాతం యాజమాన్యాన్ని కూడా కలిగి ఉండకూడదని స్పష్టంగా పేర్కొనడం వల్ల పెద్ద ఎత్తున వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14159 (అమెరికన్ ప్రజలను అక్రమ వలసల నుండి రక్షించడం)కు అనుగుణంగా ఉందని SBA తెలిపింది.
భారత్-అమెరికా ట్రేడ్ డీల్..
కొత్త నిబంధనల కారణంగా, ఈ వ్యాపారాలు యాజమాన్యాన్ని US పౌరులకు బదిలీ చేయాల్సి రావచ్చని లేదా ప్రత్యామ్నాయ ఫైనాన్సింగ్ మార్గాలను వెతకాల్సి ఉంటుందని చెప్పారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్.. డెమోక్రటిక్ పార్టీ నేతలు కూడా ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకించారు. సెనేట్, హౌస్ స్మాల్ బిజినెస్ కమిటీల ర్యాంకింగ్ సభ్యులు దీనిని వలసదారుల వ్యవస్థాపకతపై దాడిగా అభివర్ణించారు. భారతీయులపై ఈ నిర్ణయం ప్రభావం ఎక్కువగా ఉండనుంది. USCIS గణాంకాల ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో గ్రీన్ కార్డ్ పొందిన వలసదారుల్లో భారతదేశం రెండో అతిపెద్ద మూల దేశం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: