📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

Russia: ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు

Author Icon By Vanipushpa
Updated: January 23, 2026 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ పౌర విమానయాన రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న అమెరికా (బోయింగ్), యూరప్ (ఎయిర్‌బస్) సంస్థల గుత్తాధిపత్యానికి తెరదించేందుకు రష్యా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా భారత్‌లో శరవేగంగా విస్తరిస్తున్న విమానయాన మార్కెట్‌ను అందిపుచ్చుకుంటూనే.. ఇక్కడే విమానాలను తయారు చేసేందుకు నిర్ణయించుకుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్యలు కూడా తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విమానాలకు ఉన్న విపరీతమైన డిమాండ్ దృష్ట్యా.. కొత్త విమానాల డెలివరీకి ఏళ్ల తరబడి సమయం పడుతోంది. ఇలాంటి సమయంలో రష్యా(Russia) తన పౌర విమానాలను భారత్‌కు ఆఫర్ చేస్తోంది. 1500 కిలో మీటర్ల లోపు ప్రాంతీయ కనెక్టివిటీ కోసం సుఖోయ్ సూపర్ జెట్ (SSJ)-100, ఇల్యూషిన్ (IL)-114లను తీసుకు వస్తోంది. అయితే ఇవి చిన్న రన్‌వేలపై కూడా సులభంగా ల్యాండ్ కాగలవు. అలాగే 3000 కిలో మీటర్ల వరకు వెళ్లే మధ్యస్థ శ్రేణి కోసం అత్యాధునిక ఫీచర్లతో కూడిన MS-21ను అందుబాటులోకి తీసుకు రానున్నారు.

Read Also: The Vatican: శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్

Russia: ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు

రష్యా స్వదేశీ సాంకేతికతతోనే తయారు

6500 కిలో మీటర్ల సుదీర్ఘ ప్రయాణాల కోసం.. బోయింగ్ 767కు ధీటుగా నిలిచే అత్యాధునిక TU-214 విమానాలను తయారు చేయబోతున్నారు. అయితే ఈ విమానాలకు ఉండే ఇంజిన్లు, ఇంటీరియర్స్, ఇతర కీలక భాగాలు పూర్తిగా రష్యా స్వదేశీ సాంకేతికతతోనే తయారు అయ్యాయి. పాశ్చాత్య విమానాలతో పోలిస్తే వీటి నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం విమానాల విక్రయానికే పరిమితం కాకుండా భారత్‌లో వీటి ఉత్పత్తిని ప్రారంభించేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)తో కలిసి సంయుక్తంగా ఈ విమానాలను తయారు చేసే అంశంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న ‘వింగ్స్ ఇండియా 2026’ ఎయిర్ షో రష్యా విమానాలకు ప్రధాన వేదిక కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

aerospace sector aircraft manufacturing in India aviation industry India Russia Relations Make in India Russia India partnership Russian passenger aircraft Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.