Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఆగని క్షిపణి దాడులు

Read Time:  1 min
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఆగని క్షిపణి దాడులు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఆగని క్షిపణి దాడులు
FONT SIZE
GET APP

రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకర రూపం దాలుస్తోంది. తాజాగా బుధవారం రాత్రి రష్యా(Russia) జరిపిన భారీ వైమానిక దాడులతో ఉక్రెయిన్ (Ukraine) అతలాకుతలమైంది. ఇరు దేశాల మధ్య సైనికుల మృతదేహాల మార్పిడి జరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో దాడులు మాత్రం ఆగడం లేదు. బుధవారం రాత్రి రష్యా సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లోని 8 ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. మొత్తం 420 డ్రోన్లు, 39 మిసైల్స్‌ను రష్యా ప్రయోగించింది. వీటిలో అత్యంత ప్రమాదకరమైన 11 బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. బాధితుల్లో అమాయక చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, తమ భూభాగంపైకి వచ్చిన 17 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.

Read Also: Modi Isreal visit: ఇజ్రాయెల్ పర్యటన ముగింపు సందర్భంగా మోదీ కృతజ్ఞతలు

Russia-Ukraine War: Non-stop Missile Attacks
Russia-Ukraine War: Non-stop Missile Attacks

మృతదేహాల అప్పగింత

యుద్ధ క్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల మృతదేహాలను ఇరు దేశాలు పరస్పరం అప్పగించుకున్నాయి.రష్యా అధికారి వ్లాదిమిర్ మేదిన్‌స్కీ తెలిపిన వివరాల ప్రకారం.. యుద్ధంలో మరణించిన 1000 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలను ఆ దేశానికి అప్పగించారు.ప్రతిగా ఉక్రెయిన్ ప్రభుత్వం 35 మంది రష్యా సైనికుల మృతదేహాలను రష్యాకు అప్పగించింది. అయితే ఈ ప్రక్రియ ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టత లేదు.రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ‘టాస్’ (TASS) సంచలన కథనాన్ని ప్రచురించింది. ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75 దేశాల నుండి 10 వేల మందికి పైగా వాలంటీర్లు పోరాడుతున్నట్లు పేర్కొంది. ప్రతి నెలా సుమారు 600 మంది కొత్త వ్యక్తులు యుద్ధంలో పాల్గొనేందుకు ఉక్రెయిన్‌కు వస్తున్నట్లు సమాచారం. యుద్ధం పేరుతో జరుగుతున్న మోసాలకు విదేశీయులు బలవుతున్నారు. రష్యా తరఫున పోరాడుతూ తమ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు దక్షిణాఫ్రికా విదేశాంగ శాఖ ధృవీకరించింది. వీరు ‘రిక్రూట్‌మెంట్ స్కీమ్’ పేరుతో మోసపోయి రష్యాకు వెళ్లారని, చివరికి బలవంతంగా యుద్ధంలోకి దిగి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.