📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

America: వెనిజులాకు అండగా రంగంలోకి దిగిన రష్యా

Author Icon By Vanipushpa
Updated: January 7, 2026 • 3:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న అనంతరం పరిస్థితులు మారిపోయాయి. వెనెజువెలాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రష్యా(Russia) రంగంలోకి దిగింది. వెనెజువెలా తీరం వెంబడి చమరు నిక్షేపాలకు రక్షణగా సబ్‌మెరైన్‌ను, ఇతర నావికా దళాలను పంపించింది. పాత ఆయిర్‌ ట్యాంకర్‌కు రక్షణగా రష్యా వీటిని పంపించినట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్ వెల్లడించింది. అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ట్యాంకర్ అనేది అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. గత రెండు వారాల నుంచి అట్లాంటిక్‌ మహాసముద్రంలో యూఎస్‌ కోస్ట్‌గార్డ్‌ రష్యా ఓడను ట్రాక్ చేస్తోంది.

Read Also: US Defense: దాడులకు ముందు పెంటగాన్ సమీపంలో పిజ్జా ఆర్డర్లు పెరుగుతాయా?

America: వెనిజులాకు అండగా రంగంలోకి దిగిన రష్యా

రక్షణ కోసమే రష్యా సబ్‌మెరైన్, ఇతర నావాకా దళాలు

దీంతో తుప్పు పట్టిన ఖాళీ ఆయిల్‌ ట్యాంకర్‌కు రక్షణ కోసమే రష్యా సబ్‌మెరైన్, ఇతర నావాకా దళాలను పంపించినట్లు అమెరికాకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌లో యూఎస్‌ కోస్ట్‌ గార్డు ఓడను స్వాధీనం చేసుకునేందుకు యత్నించింది. కానీ సిబ్బంది మాత్రం దాన్ని అడ్డుకున్నారు. రష్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఓడకు రిజిస్ట్రేషన్ మంజూరు చేసిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ట్యాంకర్‌ను వెంబడించడాన్ని అమెరికా మానుకోవాలని రష్యా డిమాండ్ చేసింది. అలాగే ప్రస్తుతం ట్యాంకర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ ప్రాంతంలో రవాణా చేసే నిషేధిత నౌకలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

Diplomatic Support Geopolitics Global Politics International Relations russia Russia Venezuela Relations Telugu News Paper Telugu News Today Venezuela World News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.