📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

US Iran war: అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు!

Author Icon By Vanipushpa
Updated: February 21, 2026 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

US Iran war: ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకే విషయం వైపు ఆసక్తిగా చూస్తోంది. అదే… అమెరికా, ఇరాన్(Iran) మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Trump) ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా వచ్చే శనివారం నుంచే అమెరికా బలగాలు ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశం ఉందనే వార్తలు ఇన్వెస్టర్లను, వ్యాపారవేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏం జరుగుతోంది? ఇటీవల జెనీవాలో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. “అణు ఇంధనాన్ని తయారు చేసుకోవడం మా హక్కు, దాన్ని ఎవరూ అడ్డుకోలేరు” అని ఇరాన్ స్పష్టం చేసింది.

Read Also: India terror conspiracy news : చంచల్‌గూడ జైలు నుంచే కుట్ర? హైదరాబాద్‌లో లష్కరే యత్నం

US Iran war: War clouds are darkening between America and Iran!

దాడుల సమయం ఖరారయ్యే అవకాశం

యుద్ధ నౌకల మోహరింపు అమెరికా తన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌక USS Gerald Fordను తూర్పు మధ్యధరా సముద్రానికి పంపింది. ఇది అక్కడికి చేరుకోగానే దాడుల సమయం ఖరారయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే USS Abraham Lincoln ఆ ప్రాంతంలోనే ఉంది. మరోవైపు, పెంటగాన్ తన సిబ్బందిని మధ్యప్రాచ్యం నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇరాన్ ఎదురుదాడి చేస్తే నష్టం జరగకుండా అమెరికా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎలా ఉంటుంది? ఒకవేళ యుద్ధం మొదలైతే ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతాయి. ఇరాన్ తన ‘హార్ముజ్ జలసంధి’ని మూసివేస్తే ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. యుద్ధ వార్తలతో స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయే ప్రమాదం ఉంది. ఇన్వెస్టర్లు సురక్షితమైన ‘గోల్డ్’ (బంగారం) వైపు మొగ్గు చూపుతారు. అంతర్జాతీయ రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ఎలక్ట్రానిక్స్ నుండి నిత్యావసరాల వరకు అన్నీ ప్రియం అవుతాయి. అయితే ఈ విషయం పైట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చూస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Geopolitical Crisis Global Security middle east conflict military escalation Oil Market Impact Telugu News Paper Telugu News Today US-Iran Tensions Washington Tehran Relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.