📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran: హార్ముజ్‌ జలసంధిపై కొనసాగుతున్న ఉద్రిక్తతలు

Author Icon By Vanipushpa
Updated: February 20, 2026 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్‌ జలసంధిపై ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. “స్మార్ట్ కంట్రోల్ ఆఫ్ ది స్ట్రెయిట్” పేరుతో ఇరాన్ అక్కడ భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. అలాగే ఈ జలమార్గాన్ని తాము పాక్షికంగా ఆధినంలోకి తీసుకున్నట్లు ప్రకటన చేసింది. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా యుద్ధం ప్రారంభమవుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇరాన్(Iran) ఈ విన్యాసాల్లో అత్యంత శక్తివంతమైన ‘షాహిద్ సోలైమాని శ్రేణి కార్వెట్ల శక్తిని ప్రదర్శించింది. ఈ నౌకలో అమర్చబడినక్షిపణులు దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో చేధించగలవు. అంతేకాదు తమ తీర ప్రాంతం వెంబడి మొబైల్ మిస్సైల్ లాంచర్లను సైతం ఇరాన్ మోహరించింది. హార్ముజ్‌ జలసంధి కేవలం కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. దీంతో ఇరాన్ ప్రయోగించే చిన్నపాటి మిసైల్స్‌కు కూడా భారీ యుద్ధ నౌకలను ముంచేయగల సామర్థ్యం ఉంటుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.

Read Also: Youtuber Anvesh : యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షా

Iran: Tensions continue over the Strait of Hormuz

అత్యాధునిక క్షిపణి ప్రయోగ కేంద్రాలు

‘షాహిద్ సోలైమాని’ కార్వెట్లు కేవలం నౌకలు మాత్రమే కావు. అవి అత్యాధునిక క్షిపణి ప్రయోగ కేంద్రాలు. ఇరాన్ నావికాదళ చరిత్రలో మొదటిసారిగా వెర్టికల్ లాంచింగ్ సిస్టమ్‌ (VLS) సాంకేతికతను ఈ షాహిద్ సోలైమాని నౌకల్లో ప్రవేశపెట్టింది. ఈ క్షిపణులు నిలువుగా పైకి లాంచ్ అవుతాయి. దీనివల్ల నౌక ఏ దిశలో ఉన్నా కూడా 360 డిగ్రీల కోణంలో క్షణాల్లో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇందులో స్వల్ప శ్రేణి మరియు మధ్య శ్రేణి క్షిపణులను అమర్చారు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం కూడా పశ్చిమాసియాలో తమ యుద్ధ నౌకలు మోహరిస్తోంది. దీంతో ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యం కూడా ఒక్కోసారి కోలుకోలేనంత దెబ్బ తినవచ్చన్నారు. ప్రమాదకరమైన యుద్ధ నౌకలను సముద్ర గర్భంలోకి కలిపే ఆయుధాలు తమ వద్ద రెడీగా ఉన్నాయని అమెరికాను పరోక్షంగా హెచ్చరించారు. అంతర్జాతీయ మీడియా ఈ వ్యాఖ్యలను డెత్‌ వారెంట్‌గా అభివర్ణిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Global Oil Supply Gulf Region Conflict International Shipping Routes Iran Tensions maritime security Middle East crisis Strait of Hormuz Telugu News Paper Telugu News Today US Navy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.