దేశంలో 6-14 వయసు కలిగిన విద్యార్థుల పాఠశాల నమోదు గత రెండు దశాబ్దాల నుండి 95 శాతంకాగా ప్రస్తుతం 98.1 శాతంగా నమోదు కావడం చాలా శుభ పరిణామం అంటే 2018 తో పోల్చుకుంటే 2024 నాటికి నమోదు శాతం 66.8శాతం పెరిగినట్టు చెప్పవచ్చు. ఒక ప్పుడు ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు లేక సతమత మోతూ ఉంటే ప్రభుత్వ ప్రయత్నాలు తలిదండ్రులు ఉత్సు కత, ఎలిమెంటరీ స్థాయివరకు ఉచిత నిర్బంధ విద్యకు కంకణం కట్టుకున్న విద్యా హక్కు (Right to education)చట్టం
2009 వెరసి బడిబయట వున్న బడిఈడు పిల్లలను కూడా పరిగణన లోనికి తీసుకొని లెక్కిస్తే పిల్లల నమోదు సుమారు 98.1 శాతం వరకు చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పిల్లల చేరిక సరేవారి రేటెన్షన్ (తరగతిగదిలో నిలుపుదల), నాణ్య మైన విద్య అభ్యసనా సామర్థ్యాల సాధన సమ్మిళిత విద్య లో ప్రధాన భూమికగా చెప్పవచ్చు. సమ్మిళిత విద్యా లక్ష్యాలను సాధించాలంటే, పాఠశాల యాజమాన్యాలు తమతమ పాఠశాల బోధనా వ్యూహాలను ప్రత్యేకించి రచించుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు తమ
పాఠశాలలకు విద్యార్థుల నేపథ్యాలను పరిగణనలోనికి తీసుకొని పాఠ్య ప్రణాళి కలను సిద్ధం చేసుకోవాలి. ఉపాధ్యాయులు తరగతి నిర్వ హణలో తాను అవలంభించాల్సిన వ్యూహాలను స్థానికతను, విద్యార్థుల మాతృభాష, సంస్కృతి, కుటుంబ నేపథ్యం, ఆర్థిక సామజిక విషయాలను పరిగణనలోనికి తీసుకొని అభ్యసనలో విద్యార్థులకు ఎదురౌతున్న సమస్యలను పరిశీలించి విద్యార్థి ఆధారిత బాటలో తరగతి నిర్వహణజరగాలి. సమ్మిళిత విద్య అనగానే ఒక దివ్యంగులైన విద్యార్థులే కాకుండా పాఠశాలకు
వచ్చే వివిధ ఆర్థిక, సాంఘిక, సామా జిక నేపథ్యాల నుండి పాఠశాలకు వచ్చేవిద్యార్థులు అభ్యసనా ప్రక్రియలో ఎదురౌతున్న సమస్యలను తద్వారా పాఠశాల లేదా ఉ పాధ్యాయుడు అనుసరించాల్సిన వ్యూహాలను తప్పక పరిగణనలోనికి గణనలోనికి తీసుకోవాలి. తద్వారాసమ్మిళిత విద్యా లక్ష్యాలను సాధించాలి.
Read Also : Andhra Pradesh: టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..కొత్త తేదీల వివరాలు ఇవే

నాణ్యమైన సమాన విద్యను అందించడం, పాఠశాలలో చేరిన విద్యార్థులందరికి సమాన స్థాయిలో అనగా కుల, వర్గ, మత, లింగ, భాష, ప్రాంతీయ, ధనిక, పేద, గ్రామ, పట్టణ, సామాజిక వ్యత్యాసం, దివ్యాం గులు లేదా ఎటువంటి సామాజిక పరమైన వివక్ష లేకుండా అందరికి కావలసిన వసతులు, బోధనావ్యూహాలను రచించి సమాన విద్యనందించడమేనని అందరూ గ్రహించాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నూతన విద్యా విధానం నిజమైన స్ఫూర్తితో రూపుదాలిస్తే దేశంలో పిల్లలు ఎదుర్కొంటున్న అభ్యసనా సామర్థ్యాల సవాళ్లకు ఒక సమాధానమే కాక ఉన్నత విద్యలో విద్యార్థులు సులభంగా తాము అనుకున్న విద్యా లక్ష్యాలను సాధించడానికి తద్వారా దేశం సమ్మిళిత విద్యా చట్రంలో పొందుపరచిన వివిధ నేపథ్యాల నుండి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అందరికీ నాణ్యమైన సమాన విద్యా సామర్థ్యాలు సమకూర్చడానికి సానుకూలత ఏర్పడు తుంది. అంతేకాక ప్రభుత్వం విద్యార్థి తన మాతృ భాషలో చదువుకొనే వెసులుబాటు కల్గించడం అంటే విద్యార్థి ప్రాథమిక ఉన్నత విద్యవరకు తాను మాతృభాషలో చదుకొనే అవకాశం ఏర్పరచింది. ఆంగ్లం లేదా స్థానిక భాషలోనే చద వాలనే నిబంధన లేకుండా ఆయా రాష్ట్రాలు భాషా బోధన లో తన నిర్ణయం తీసుకొనే వెసులుబాటు కూడా కల్పించిం ది. దీనికితోడు విద్యార్థికి పటిష్టమైన పునాది ఏర్పరచడానికి ప్రాథమిక స్థాయిలో ఫౌండపనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రాథమిక పాఠ శాలల్లో 2026-27వ సంవత్సరానికి విద్యార్థి మూడువతర గతికి చేరే నాటికీ అవగాహనతో చదవడం, రాయడం గణిత సామర్థ్యాలు సాధించడం తద్వారా ఎలిమెంటరీ స్థాయికి విద్యార్థి చేరేనాటికి ప్రతి విద్యార్థి తమ తరగతి స్థాయి విద్యా సామర్థ్యాలు సాధించడం, ఉపాధ్యాయులను తదను గుణంగా అన్ని స్థాయిల్లోనూ తగిన నైపుణ్యాలతో సంసిద్ధం చేయడం సమ్మిళిత విద్యా లక్ష్యసాధనలో నూతన విద్యా విధాన ప్రధాన భూమికయని చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో పాఠశాలలు తమపాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి నేపథ్యా న్ని, పరిగణలోకి తీసుకోవడం, తదనుగుణమైన బోధనావ్యూహాలను రచించుకోవడం, తరగతిని బైల్స్ ఫ్రెండ్లీ తర హాగా తీర్చిదిద్దడం, భారంలేని విద్యను అందించడం ద్వారా జాతీయ విద్యాచట్రం (నేషనల్ కరికులం ఫ్రేంవర్క్) ప్రధాన లక్ష్యం నెరవేరుతుంది. దీనికి ప్రధానంగా విద్యావ్యవస్థలో వున్న వివిధ విభాగాలు ఉమ్మడిగా అకడమిక్ అభ్యున్నతికి కృషి చెయ్యాలని నూతన విద్యా విధానం సమ్మిళిత విద్యా సాధనకు ప్రధాన భూమికగానిర్వచించింది.
సమ్మిళిత విద్య
ఇక సమ్మిళిత విద్యాలక్ష్యాలను పరిశీలిస్తే పిల్లల సామర్థ్యాలు, వారు నేర్చు కొనే నేపథ్యంలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి పాఠ శాల యాజమాన్యం తప్పక పరిగణనలోనికి తీసుకోవాలి. అనగా సమ్మిళిత విద్య అనగానే ఒక దివ్యంగులైన విద్యా ర్థులే కాకుండా పాఠశాలకు వచ్చే వివిధ ఆర్థిక, సాంఘిక, సామాజిక నేపథ్యాలనుండి పాఠశాలకు వచ్చే విద్యార్థుల అభ్యసనాప్రక్రియలో ఎదురౌతున్న సమస్యలను తద్వారా పాఠశాల లేదా ఉపాధ్యాయుడు అనుసరించాల్సిన వ్యూహా లను తప్పక పరిగణనలోనికి తీసుకోవాలి. తద్వారా సమ్మి ళిత విద్యా లక్ష్యాలను సాధించాలి. ‘సమ్మిళిత విద్య’ అంటే సమాజంలో వుండే పిల్లలందరినీ ఒకే గొడుగు క్రింద ఉన్న పాఠశాలలో చేర్చి నాణ్యమైన, సమాన విద్యను అందించడం అనివార్యం. ఈ దిశగా అన్ని పాఠశాలలు తగిన వ్యూహాల ను రచించడం అందుకు ఉపాధ్యాయులను సుశిక్షితులుగా తీర్చిదిద్దడం పాఠశాల యాజమాన్య ప్రధాన పాత్రగా గ్రహించాలి. వాస్తవాలు పరిశీలిస్తే సుమారు 40 శాతం మంది విద్యార్థులుఇప్పటికీ అభ్యసనా లేమితో సతమవుతు న్నట్టు అనేక నివేదికలు చెబుతున్నాయి. ప్రాథమిక స్థాయి నుండి పునాది లేకుంటే భవిష్యత్తరాలు ఉన్నత విద్యాభ్యా సంలో కూడా సరైనప్రగతి గడించలేని పరిస్థితి పునరావృత మౌతుందని నిపుణులు వక్కాణిస్తూనే వున్నారు. ఇప్పటికే 8వ తరగతిలో ప్రవేశించినప్పటికీ విద్యార్థులు ఒక పేరా కూడా తడబడకుండా తప్పులు లేకుండా చదవలేకపోతు న్నారు అంటే ఆ కోవకు చెందిన విద్యార్థులు చదువు కాల మంతా ఒక విష వలయంలోనే చిక్కుకుపోతున్నారు. ఈ పరిస్థితిలో పదవతరగతిలో ప్రవేశించే నాటికి పాఠశాలలు 80శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఈ మధ్యనే ఎన్.సి. ఆర్.టి నిర్వహించిన ఫరక్ రాష్ట్రీయ సేవాక్షన్ సర్వే ప్రకా రం సుమారు ప్రకారం సుమారు 75శాతం మంది 9 వ తరగతి విద్యార్థులు తరగతి విద్యార్థులు చిన్నచిన్న కాన్సెప్ట్ లను కూడా అర్థం చేసుకోని దుస్థితిలో ఉన్నారు. అంతేకాక చిన్నచిన్న గణిత సంబంధిత సమస్యలను కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు.

ఫరక్ రాష్ట్రీయ సేవాక్షన్ సర్వేలోముందంజలో వున్న పంజాబ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను ప్రగతి సాధనలో వారు రచించిన వ్యూహాలను అధ్యయనం చేయలేమా? దేశంలో సుమారు 47 శాతం 3వ తరగతి విద్యార్థులుచిన్నకథను కూడా చదివి అర్థం చేసుకో లేని స్థితిలో వున్నారు. 36శాతం మంది విద్యార్థులు కూడి కలు కూడా చేయలేకపోయారు. 6 వ తరగతిలో సుమారు 34శాతం మంది స్థానిక సంస్థలు,మార్కెట్ ఇతర సంస్థల పని గురించి కుడా తెలియపరచలేకపోయారు. 9వ తరగతి విద్యార్థులు సుమారు 55శాతం మంది సోషల్ స్టడీస్ సబ్జె క్టులో రాజ్యాంగం గురించి, వాటి సూత్రాలు జాతీయ ఉద్యమాల గురించి వెల్లడించలేని పరిస్థితిలో వున్నారు. ఈ పరి స్థితులను చక్కదిద్దడానికి, ప్రతి విద్యార్థి తరగతి వారి అభ్య సనా సామర్థ్యాలు సాధించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని సామర్థ్యాలలో వెనుకబడి ఉన్న కనీసం 40శాతం మంది విద్యార్థులు కోసం ప్రత్యేక వ్యూహాలతో సిలబస్పూర్తి చేయడమనే లక్ష్యంకన్నా తరగతి గదిలో అభ్యసనలో వెను కబడ్డ విద్యార్థులను తీర్చి దిద్దడానికి కంకణం కట్టుకోవాలి. అప్పుడే నూతన విద్యా విధాన ప్రధాన భూమికగా వర్ణించే సమ్మిళిత విద్యా సాధనా లక్ష్యం నెరవేరుతుంది. విద్యా హక్కు(Right to education) చట్టం 2009లో పొందుపరచిన బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందు బాటులోనికి తీసుకురావడానికి మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల పెంపు తక్షణమే జరగాలి. 21వ శతాబ్దపు నైపుణ్యాలను పుణికి పుచ్చు కొనేలా విద్యా వ్యవస్థను బలపరచాలనేదే మూల సూత్రంగా, ఉండాలి. ఈ విద్యా విధాన అమలులో ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు తలిదండ్రులు పాఠశాల యాజమాన్యాలు కలసికట్టుగా కృషి చేయడమే మనందరి ముందున్న ప్రధాన కర్తవ్యం.
-మల్లాడి శ్రీనగేష్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: