📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rayalaseema: రాయలసీమ ‘జల రాజకీయ ‘సీమ

Author Icon By Sudha
Updated: March 4, 2026 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తె లంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే నిలుపుదల చేయించానని చెప్పడం చూస్తుంటే మరొకసారి రాయలసీమ జల రాజకీయ సీమగా మారింది. రాయలసీమకు గుండెకాయ లాంటి ఎత్తిపోతల పథకంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సీమ ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పక్కదారి పట్టించేందుకు పాలకులు ముచ్చుమర్రి పేరును తెరపైకి తెస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే తప్ప సీమ ఎడారి కాకుండా ఉంటుంది. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా హక్కు దక్కిన కృష్ణా జలాలను సమర్థవంతంగా రాయలసీమ వాసులు వినియోగించలేకపోయారు. శ్రీశైలంలో 777 అడుగుల నుంచే ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ, దిగువకు ౪ టీఎంసీలను తరలిస్తూ శ్రీశైలం ప్రాజెక్టు ను ఖాళీచేస్తుండటం వల్ల ఆంధ్రరాష్ట్ర నీళ్ల వాటా ఉన్నప్ప టికీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీటిని సరఫరా చేయలేని దుస్థితి. శ్రీశైలం నుంచి 798 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి సామర్థ్యాన్ని పెంచి రోజుకు0.45 టీఎంసీలు తరలించేలా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి రోజుకు 7.95 టీఎంసీలు తెలం గాణ వాడుకుంటున్నది. శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల వద్ద మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను అమర్చా రు. ప్రాజెక్టులో నీటి మట్టం 841 అడుగులు ఉంటే 2 వేల క్యూసెక్కులు 854అడుగులు ఉంటే 7 వేల క్యూసెక్కులను మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా తరలించే అవకాశం ఉం టుంది. 881అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉన్న రోజుల్లో మాత్రమే ప్రస్తుత డిజైన్ ప్రకారం పోతిరెడ్డిపాడు ద్వారా 44వేల క్యూసెక్కులు తరలించడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి దిగువకు లక్ష క్యూసెక్కులు విడుదల చేసినా జూరాల, శ్రీశైలం నుంచి వచ్చిన నీటిని వచ్చినట్టుగా తెలంగాణకు తరలిస్తుండటంతో శ్రీశైలంలో నీటి మట్టం పెరగడం లేదు. దాంతో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్పై ఆధారపడిన ఎస్సార్బీసీ, తెలుగు గంగ, గాలేరు నగరి పాజెక్టులకు 101 టీఎంసీల కేటాయిం పులు ఉన్నా సరే, ఆ ప్రాజెక్టుల కింద ఉన్న 10.33 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించలేని దుఃస్థితి నెలకొంది. ఇక సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తి పోతలను తెలంగాణ సర్కార్ చేపట్టితే కేసి కెనాల్ ఆయకట్టు రైతులకు భారీ నష్టంతప్పదు.

Read Also : Andhra Pradesh: రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

Rayalaseema

ఇక చరిత్రలోకిపోతే చెప్పేవాళ్లను బట్టి చరిత్ర చాలా మారుతుంది. రాయలసీమకు సాగు, త్రాగునీళ్లు లేకపోవడానికి చాలా కారణాలు చెప్పుకోవ చ్చు. ఎన్ని కారణాలు చెప్పినా ముఖ్యమంత్రులు అంతా మీ వాళ్లే కదబ్బా అంటారు. వందేళ్ళ పైబడిన సమస్య ఇది. ఇది నీళ్ల చరిత్ర కాదు కన్నీళ్ల చరిత్ర. 1905లో బ్రిటిష్ ఇంజనీర్స ర్ మెకంజీ సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళిక అమలు జరిగి ఉంటే కృష్ణ, తుంగభద్ర, పెన్నా, నదులు, సంగమంతో మొత్తం 30 లక్షల ఎకరాలకు సీమలో నీరు అంది ఉండేది. కానీ ఈ పథకం అమలు కాలేదు. డిసెంబర్ 1937లో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం నీటిపారుదల సమస్యలు ఎప్పు డు ఉత్పన్నమైనా ముందుగా రాయలసీమ జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యంగా తుంగభద్ర, కృష్ణ, పెన్నా, నదుల అనుసంధానంతో పెద్ద ప్రాజెక్టులు కట్టాలని తీర్మానం చేశారు. దీనిని పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. 1951లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం రూపొందించిన కృష్ణా పెన్నార్ ప్రాజెక్టుకు ప్లానింగ్ కమిషన్ అనుమతి కూడా లభించింది. ఈ ప్రాజెక్టు పూర్తయి ఉంటే, రాయలసీమ సస్యశ్యామలమై ఉండేది. కృష్ణా నీరు ౧౦౦ టిఎంసీలు సీమకు లభించి ఉండేది. దీనిని అడ్డుకొని నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మించారు. చుక్క నీరు కూడా సీమకు లేదు. ఇది నదీ జలాల సమస్య, వీటిని టిఎంసిలలో కొలుస్తారు. ఒకటి ఎంసి 100 కోట్ల ఘనపు అడుగులు. పదివేల ఎకరాలకు సాగుకు సరిపోతుంది. సీమకు వంద టిఎంసిలు సరిపోతా యి. కృష్ణానదిలో అన్ని నీళ్లు సీమకు కావాలని వాటా గురించి అడిగేవాళ్ళు ఉండాలి. అలాగే ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి. గోదావరి అడవుల్లో ప్రవహిస్తే, కృష్ణా నదిమైదాన ప్రాంతంలో ప్రవహిస్తుంది. అందుకే కృష్ణా నీటి అవసరం అందరికీ ఎక్కువే. అందుకోసమే ఈ గొడవలు. నికర జలాలని, మిగులు జలాలని లెక్కలు కుదరవు. వంద సంవ త్సరాలలో 75ఏళ్లు తప్పనిసరిగా నదిలోఎంత నీరు ఉం టుందో ఆ నీటినీ నికర జలాలని, అంతకన్నా ఎక్కువ నీరు ఉంటే మిగులు జలాలని అంటాము. రాయలసీమలో(Rayalaseema) పెన్నా నది అనేది మాత్రమే ఉంది. అది కూడా నిస్సారమైన నది.

Rayalaseema

కడప జిల్లా మొత్తం పెన్నా బేసిన్లోనే ఉంది. అనంతపురం ప్రధానంగా పెన్నా బేసిన్లోనూ, పాక్షికంగా కృష్ణానది బేసిస్లోనూ ఉంది. కర్నూల్ కాస్త ఎక్కువగా. కృష్ణాబేసిన్లో ఉన్నా, ఎక్కువ భాగం పెన్నా బేసిన్లోనే ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఉన్నది పెన్నా ఉపనదులే, తుంగభద్ర ప్రాజెక్ట్ పెద్దదిగా కట్టి సీమకు ఉపయోగపడే విధంగా చేయ లేక పోయాం. అది మరుగుజ్జుగా మారింది. కర్నూలు కడప కాలువను ౧౮౬౧ నుంచి 1871 మధ్యకాలంలో నిర్మించారు. ఇది అస్థిర జల ఆధారమని అందరికి తెలుసు. ఇక ఈ కేసీ కెనాల్ వలన రాయలసీమ(Rayalaseema) నీటి కొరత తీరదు. కరువు ప్రాం తాలను కాపాడుకునేందుకు,సీమ సాగు తాగునీటి అవస రాలకు ఎత్తిపోతల పథకమే శరణ్యం. అయితే తెలంగాణ వారు శ్రీశైలంలో 796 అడుగుల నుంచి రోజుకు నాలుగు టిఎంసిలను, పాలమూరు దిండి కల్వకుర్తి
ఎస్ఎల్బీసినుంచి 800 అడుగుల నుంచి రోజుకి 2.0 తరలిస్తుండడం వల్ల నీటిమట్టం తగ్గిపోతుంది. సాగునీరు రాకపోతే రాయలసీమ ఎడారే అవుతుంది. ఇది రాయలసీమ పరిస్థితి. ఇక్కడ ఒక్క ప్రాజెక్టు కూడా మన పాలకులు కట్టిన పాపానపోలేదు. అను కున్న ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. సీమకు ఏకైక ఆధారం కృష్ణా జలాలు. తెలంగాణ వాళ్లు మిగులు జలాలు మావి అంటున్నారు. రాయలసీమ వాళ్లకు మిగులుజలాలపై హక్కు లేదంటున్నారు. రాయలసీమలో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కృష్ణానది మిగులు జలాలపై ఆధారపడినవే. ఇవి కట్టకపోతే ఇక్కడ తాగునీరు సాగునీరు లభించదు. ఇక్కడ భూగర్భ జలాలు, వర్షపాతం తక్కువ, కృష్ణా జలాల పంపిణీకి సం బంధించి గతంలో పలు ఒప్పందాలున్నప్పటికీ రాష్ట్రవిభజన తర్వాత 2015లో కుదిరిన ఒప్పందాన్ని బట్టి రాయలసీమ కు 144.70టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు, కోస్తాకు 367.34 టిఎంసిల వాటాను కేటాయించగాదానిని ఉల్లం ఘించి తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులో 881అడుగుల పైగా నీరుంటేనే పోతి రెడ్డిపాడు నుంచి సీమకు రావాల్సిన 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకోవడం సాధ్యమవుతుంది.
-డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News latest news political issues Rayalaseema regional politics Telugu News Water Crisis water politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.