Trade Deal: ట్రేడ్​ డీల్ వల్ల రైతులకు భారీ నష్టం: రాహుల్ గాంధీ

Read Time:  1 min
ట్రేడ్​ డీల్ వల్ల రైతులకు భారీ నష్టం: రాహుల్ గాంధీ
ట్రేడ్​ డీల్ వల్ల రైతులకు భారీ నష్టం: రాహుల్ గాంధీ
FONT SIZE
GET APP

భారత్​-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై లోక్​సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్(Rahul Gandhi) గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని బెదిరించడానికి ఎప్​స్టీన్ ఫైళ్లను అమెరికా అధ్యక్షుడు ఉపయోగించారని ఆరోపించారు. ఈ ఒప్పంద వల్ల భారత రైతులు బలి అవుతున్నారని ఆరోపించారు. గురువారం కేరళ కన్నూర్​ జిల్లాలోని పెరవూరులో రైతుల మహాసభను నిర్వహించారు. ఈ సభలో మాట్లాడుతూ కేంద్రంపై ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Read Also: Central Railway: హోలీ పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు

 Trade deal will cause huge loss to farmers: Rahul Gandhi
Trade deal will cause huge loss to farmers: Rahul Gandhi

అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం

‘రైతులే దేశానికి పునాది. ఈ సాధారణ వాస్తవాన్ని కేంద్రం అర్ధం చేసుకోవడం లేదు. ఐటీ వంటి ఇతర రంగాలపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ పునాది బలోపేతం చేయకుండా ఏం నిర్మించలేం. పునాదిని గౌరవించకపోతే ఏదీ నిలబడదు. పునాది వేసే వ్యక్తికి గౌరవం, రక్షణ ఉండాలి. మనం రోజూ ఆహారం తింటాం కానీ అది మన ముందుకు తీసుకొచ్చే రైతును గుర్తు చేసుకోము. ఇక అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఆ పునాది తవ్వినట్టే ఉంది. తక్కువ స్థాయిలో యాంత్రీకరణ కలిగిన చిన్న స్థాయి రైతులు మనవాళ్లు. అమెరికా రైతులకు విస్తారమైన భూములు, అధిక యాంత్రీకరణ ఉంద అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘3.5 మిలియన్ ఎప్​స్టీన్ ఫైల్స్ ఇంకా బయటకు ఇంకా రాలేదు. అవి అమెరికా ప్రభుత్వ వద్ద రహస్యంగా ఉన్నాయని, అందులో భారత ప్రధానిపై సమాచారం ఉందని ఆరోపణలు ఉన్నాయి. రెండో అంశం అమెరికాలో అదానీ కేసు. అందుకే బీజేపీ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు ప్రధానమంత్రి భారత రైతులను బలి చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.