పశ్చిమాసియా(West Asia) సైనిక ఘర్షణ చివరకు భారత్ పొరుగుదేశం దాకా చేరుకుందని, అయినా ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. శ్రీలంక సమీపంలోని హిందూ మహాసముద్రంలో ఇరాన్‌కు చెందిన ఐఆర్ఐఎస్ దేనా యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి ముంచేసినా మోదీ మాట్లాడకపోవడం సరికాదన్నారు. ఇరాన్‌కు చెందిన ఆ యుద్ధనౌక విశాఖపట్నంలో జరిగిన మిలన్ 2026, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 (ఐఎఫ్‌ఆర్) సైనిక విన్యాసాల్లో పాల్గొనేందుకే భారత్‌కు వచ్చిందని రాహుల్ తెలిపారు. ఆ నౌక భారత్ నుంచి ఇరాన్‌కు తిరిగి వెళ్తుండగా మార్గం మధ్యలో అమెరికా జలాంతర్గామి ముంచేసిందని చెప్పారు. ఈమేరకు గురువారం ఆయన ఒక ట్వీట్ చేశారు.
Read Also: US vs Iran: ‘గ్రావిటీ బాంబు’ ప్రయోగిస్తామంటూ రక్షణ కార్యదర్శి హెచ్చరిక!
ముడి చమురు, సహజ వాయువు విభాగాలపై ప్రతికూల ప్రభావం
ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన దేశం తరఫున ధైర్యంగా నిలువగలిగే, మాట్లాడగలిగే నాయకుడు కావాలని రాహుల్ పేర్కొన్నారు. కానీ భారతదేశ వ్యూహాత్మక స్వతంత్రతను ప్రధాని మోదీ ఇతర దేశాలకు సరెండర్ చేసి రాజీకి వచ్చారని మండిపడ్డారు. ఇరాన్ నౌకను అమెరికా ముంచేసిన అంశంపై ఇప్పటిదాకా భారత ప్రధాని ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. గల్ఫ్ ప్రాంతంలో జరుగుతున్న సైనిక ఘర్షణ వల్ల భారత్‌కు జరిగే ముడి చమురు సప్లైలకూ ముప్పు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్ వినియోగించే ముడి చమురులో 40 శాతానికిపైగా ఇరాన్‌కు చెందిన హార్ముజ్ జలసంధి మీదుగానే వస్తుంటుందని గుర్తుచేశారు. ఈ పరిణామాలు ముడి చమురు, సహజ వాయువు విభాగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని రాహుల్ హెచ్చరించారు. ప్రస్తుతం యావత్ ప్రపంచం అనిశ్చితిలో ఉందని, రాబోయేది కష్టకాలమని ఆయన వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: