📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Raghurama Krishna Raju case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు

Author Icon By Rajitha
Updated: February 27, 2026 • 2:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సునీల్ నాయక్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్కు సంబంధించి గుంటూరు న్యాయస్థానం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా విచారణకు గైర్హాజరవుతున్న సునీల్ నాయక్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Read also: Satyakumar Yadav: కిడ్నీ రోగులకు ఏపీ సర్కార్ భరోసా

Raghurama custodial torture case

ప్రస్తుతం బీహార్ లో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న నాయక్ను తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు ఇప్పటికే పాట్నాలో పాగావేశారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ రఘురామను అరెస్ట్ చేసిన సమయంలో, కస్టడీలో ఆయన పై అమానుషంగా భౌతిక దాడి జరిగిందన్న ఆరోపణలపై నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

విచారణలో భాగంగా పోలీసులు నిన్న కోర్టులో వారెంట్ పిటిషన్ దాఖలు చేయగా, నిందితుడి సహాయ నిరాకరణను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తక్షణమే అరెస్ట్ వారెంట్కు పచ్చ జెండా ఊపింది. అయితే, బీహార్లో సునీల్ నాయక్పై అరెస్ట్ ప్రక్రియ ఉత్కంఠకు దారితీస్తోంది. ఇప్పటికే ఏపీ పోలీసు బృందం పాట్నాలో ఆయనను అదుపులోకి తీసుకుని, ఏపీకి తీసుకొచ్చేందుకు అక్కడి కోర్టులో ట్రాన్సిట్ పిటిషన్ వేయగా ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అంతేకాదు, నెల రోజుల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా ఉన్నట్టు సమాచారం. తాజాగా గుంటూరు కోర్టు సునీల్ నాయక్పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీచేసిన నేపథ్యంలో, ఏపీ పోలీసులు మరింత పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. ఆ ఐపీఎస్ అధి కారిని పట్టుకునేందుకు బీహార్ పోలీసు యంత్రాంగం సహకారం కోరుతూ, వీలైనంత త్వరగా ఆయనను గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

IPS Sunil Nayak latest news Non-bailable warrant Raghurama Krishna Raju case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.