📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Proddutur Student Suicide: హాస్టల్ విద్యార్థి ఆత్మహత్య

Author Icon By Rajitha
Updated: March 3, 2026 • 2:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రొద్దటూరు క్రైం : పొద్దుటూరులోని నడింపల్లి హాస్టల్లో తలారి నర్సింహులు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన తలారి ఓబులేసు కుమారుడు తలారి నర్సింలు ప్రొద్దుటూరులోని నడింపల్లి ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాడు. ప్రస్తుతము పదవ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ తరుణంలో ఆదివారం పొట్లదుత్తిలోని తన పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు. రాత్రి భోంచేసిన తర్వాత రాత్రి 7.30 గం.ల సమయంలో హాస్టల్ దగ్గర బైక్పై పెద్దనాన్న వదిలిపెట్టి వెళ్లారు.

Read also: Vetlapalem Tragedy: కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

Hostel student commits suicide

మా కొడుకు చనిపోయేంత పిరికివాడు కాదు

రాత్రి 11 గంటల వరకు స్నేహితులతో ఉల్లాసంగా గడిపాడు. ఉదయం ఐదున్నర గంటలకు స్నేహితులు హాస్టల్ బయట చూడడంతో నేరేడుచెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. ఈ విషయం వెంటనే హాస్టల్ వార్డును బ్రహ్మానందరెడ్డికి ఫోన్ల ద్వారా విద్యార్థులు సమాచారం అందించారు. వెంటనే హాస్టల్కు చేరుకొని మృతి చెందిన నర్సింహులను ఆఫీస్ రూమ్కు తరలించి, విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు రాత్రి బాగున్నావ్, ఇలా ఎలా జరిగింది? మా కొడుకు చనిపోయేంత పిరికివాడు కాదు, ఎవరో చంపేశారని ఆరోపిస్తూ రోదించారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థి మరణించాడని

విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న అధికారులు డిడి సరస్వతి, డిఇఓ శంషుద్దీన్ శోభారాణి తదితరులు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థి మరణించాడని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపోతుల నాగరాజు అక్కడికి చేరుకొని చావుకు కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించి విద్యార్థులు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని టౌన్ సిఐని కోరారు. టూ టౌన్ సిఐ కేసు నమోదు చేసుకొని నర్సింహులు దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

education department Investigation latest news Police case Proddutur Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.