📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం

Indonesia: పెళ్లికి ముందు శృంగారం చేస్తే..జైలు శిక్ష

Author Icon By Vanipushpa
Updated: January 3, 2026 • 12:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పర్యాటక స్వర్గధామంగా పేరొందిన ఇండోనేషియా(Indonesia)లో ఇకపై స్వేచ్ఛకు సంకెళ్లు పడనున్నాయి. దశాబ్దాల కాలం నాటి డచ్ వలసవాద చట్టాలను పక్కనపెట్టి.. సొంతంగా రూపొందించుకున్న నూతన శిక్షాస్మృతిని శుక్రవారం నుంచి ఆ దేశం అధికారికంగా అమలు చేస్తోంది. ఈ కొత్త చట్టం ప్రకారం.. వివాహానికి ముందు శృంగారంలో పాల్గొనడం, పెళ్లి కాకుండా సహజీవనం చేయడం ఇప్పుడు తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.

ఏడాది పాటు జైలు శిక్ష.. లేదా భారీ జరిమానా

నూతన శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 411 ప్రకారం.. వివాహం కాకుండా శృంగారంలో పాల్గొంటే గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధిస్తారు. అయితే ఇందులో ఒక కీలక నిబంధన ఉంది. కేవలం బాధితుల జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా పిల్లలు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదు చేస్తారు. మూడవ వ్యక్తులు లేదా అపరిచితులు చేసే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోరు. అదేవిధంగా వివాహం చేసుకోకుండా జంటలు ఒకే ఇంట్లో కలిసి ఉంటే వారికి ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

Read Also: BYD overtakes Tesla : BYD టెస్లాను వెనక్కి నెట్టింది: ప్రపంచంలో నెంబర్-1 EV కంపెనీగా చైనా BYD

Indonesia: పెళ్లికి ముందు శృంగారం చేస్తే..జైలు శిక్ష

విదేశీ పర్యాటకులకూ వర్తింపు..

ఈ చట్టం కేవలం ఇండోనేషియా పౌరులకే కాకుండా.. అక్కడికి వెళ్లే విదేశీ పర్యాటకులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా బాలి వంటి ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు వచ్చే విదేశీయులు ఈ చట్టం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ వ్యాపార సంఘాలు, హోటల్ అసోసియేషన్లు ఈ నిర్ణయంపై గళమెత్తాయి. ఈ కఠిన నిబంధనల వల్ల పర్యాటకులు ఇండోనేషియాకు రావడానికి వెనుకాడుతారని.. తద్వారా పర్యాటక రంగం, విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. కేవలం శృంగారంపైనే కాకుండా.. దేశాధ్యక్షుడిని, ప్రభుత్వ సంస్థలను విమర్శించడం, జాతీయ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా ఈ కొత్త చట్టం ప్రకారం నేరాలుగా మారాయి. ఇది పౌర స్వేచ్ఛను అణచివేయడమేనని మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.
Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

India laws Indian Law Jail sentence legal consequences legal penalties marriage laws moral conduct pre-marital sex sexual conduct Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.