హైదరాబాద్ నగరంలో సొంత ఇల్లు కలగంటున్న మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ మరియు రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాల్లో తక్కువ ధరకే ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. కూకట్‌పల్లి (kukatpally) హౌసింగ్ బోర్డు తరహాలో సమగ్ర సదుపాయాలతో గృహ సముదాయాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెరుగుతున్న ఇళ్ల ధరల కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఇది ఉపయోగకరంగా మారనుంది. నగర పరిధిలో కనీసం వంద ఎకరాల్లో ఈ గృహ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read also: Hyderabad: మధ్యతరగతి ప్రజలకు రేవంత్ రెడ్డి బంపర్ ఆపర్
Low-priced houses in Hyderabad.. in these areas only
నాలుగు ప్రాంతాల్లో గృహ సముదాయాల ప్రతిపాదన
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హౌసింగ్ విధానంపై నిర్వహించిన సమీక్షలో మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు నమూనాను ఆదర్శంగా తీసుకుని నాలుగు ప్రాంతాల్లో భూములను గుర్తించాలన్నారు. పది రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను సూచించారు. తక్కువ ధరలతో నాణ్యమైన నిర్మాణం అందించడమే ప్రధాన ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. నగర శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం ఇళ్ల ధరలు అధికంగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో గృహాలు లేవు. ఈ కొత్త ప్రణాళికతో సొంతింటి కల సాకారం కావచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా అందుబాటు గృహ విధానం
రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో పేదలు, అల్పాదాయ వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరల ఇళ్లు అందించేందుకు ప్రత్యేక గృహ విధానం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ విధానానికి రూపురేఖలు తయారవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మురికివాడల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి పేదలకు అందించాలని భావిస్తున్నారు. అలాగే వరంగల్, కరీంనగర్, నల్గొండ వంటి పట్టణాల్లో కూడా గృహ సముదాయాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. నగర విస్తరణ దృష్ట్యా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళిక రూపొందుతోంది. ప్రజలకు సురక్షితమైన, అందుబాటు ధరలో గృహాలు అందించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: