📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Modi-Carney meeting: మోదీ–కార్నీ భేటీలో కుదిరిన కీలక ఒప్పందాలు

Author Icon By Vanipushpa
Updated: March 3, 2026 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రధాని నరేంద్ర మోదీ(Modi) – కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Carney) మధ్య న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక చర్చలు భారత్-కెనడా సంబంధాల్లో కీలక మలుపుగా మారాయి. ఈ భేటీ అనంతరం రెండు దేశాలు పౌర అణుశక్తి రంగంలో దీర్ఘకాలిక Uranium సరఫరాకు సంబంధించిన ఒక మైలురాయి ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)ను త్వరలో ఖరారు చేయాలనే దిశగా ముందడుగు వేశాయి అని వార్తా సంస్థ పిటిఐ వెల్లడించింది. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ ఉన్నతస్థాయి చర్చల తర్వాత.. ఇరుదేశాలు కీలక ఖనిజాలు, ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి అనేక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే ఒప్పందాలపై అంగీకరించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పౌర అణుశక్తి రంగంలో దీర్ఘకాలిక యురేనియం సరఫరాకు సంబంధించిన ఒప్పందం భారత్‌కు శక్తి భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, ఆధునిక అణు రియాక్టర్లపై కూడా రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.

Read Also: Bahrain Attack: ఇరాన్ ప్రతీకారం.. బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు

Key agreements reached in Modi-Carney meeting

ఈ ఒప్పందం ప్రకారం..

కెనడా భారతదేశానికి యురేనియాన్ని సరఫరా చేయనుంది. అణుశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలనే భారత్ లక్ష్యాలకు ఇది కీలక మద్దతుగా నిలుస్తుంది. కెనడా ప్రధాని కార్నీ కూడా దీనిని వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యంగా అభివర్ణించారు. CAD 2.6 బిలియన్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం భారత్ అణు ఆశయాలకు గణనీయమైన తోడ్పాటునిస్తుందని ఆయన తెలిపారు. అదనంగా.. కెనడా తన పశ్చిమ తీరంనుంచి ద్రవీకృత సహజ వాయువు (LNG)ను విశ్వసనీయంగా సరఫరా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కార్నీ పేర్కొన్నారు. తయారీ, క్లీన్ టెక్నాలజీ, అణు పరిశ్రమలకు అవసరమైన కీలక ఖనిజాల విషయంలో కెనడా భారత్‌కు ముఖ్యమైన భాగస్వామిగా మారనుందని ఆయన అన్నారు. రెండు దేశాలు రక్షణ పరిశ్రమలు, సముద్ర భద్రత రంగాల్లో పరస్పర అవగాహనను పెంచుకోవాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం, రాడికలైజేషన్ వంటి సమస్యలు ప్రపంచమంతటికీ ముప్పుగా మారాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్-కెనడా మధ్య సన్నిహిత సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోదీ.. భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశమంటూ.. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా రెండు దేశాలు ముందుకు సాగనున్నాయి. ఇందుకోసం సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయాలని మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు రెండు దేశాల్లో పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Climate finance initiatives G20 financial stability Global economy and India Green finance agreements India investment opportunities Mark Carney India Visit PM Modi Mark Carney Meeting Sustainable development goals Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.