సంబంధాలను మరింత బలోపేతం చేసింది. క్నెస్సెట్ ప్రత్యేక ప్లీనరీలో ఇజ్రాయెల్ చట్టసభ సభ్యులందరూ లేచి మోదీ(Modi)కి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. గౌరవ వందనం సమర్పించారు. తరువాత ఇజ్రాయెల్ పార్లమెంట్ ఇచ్చే అత్యున్నత గౌరవ పురస్కారం ‘స్పీకర్ ఆఫ్ ది క్నెస్సెట్ను’ భారత ప్రధానికి ప్రదానం చేశారు. వ్యక్తిగతంగా భారత్-ఇజ్రాయెల్ సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన అసాధారణ కృషికి గాను మోదీకి ఈ పురస్కారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధంగా ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న తొలి విదేశీ నేతగా మోదీ నిలిచారు.
Read Also: Lucknow Road Accident: లక్నోలో బస్సు ప్రమాదం.. 5గురు మృతి
మోదీకి ‘స్పీకర్ ఆఫ్ ది క్నెస్సెట్ను’ ప్రదానం
క్నెస్సెట్ లోపల వాతావరణం ఏదో అధికారిక కార్యక్రమంలా కాకుండా, వ్యక్తిగత ఆత్మీయతతో నిండిపోయినట్లు కనిపించింది. మోదీ ప్రసంగం ముగిసిన తరువాత ఇజ్రాయెల్ ఎంపీలు, ఆయన వద్దకు వచ్చి కరచాలనం చేసి, సెల్ఫీలు దిగుతూ, ఆయనతో ముచ్చటించారు. ఇది రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని ప్రతిబింబించాయి. 2017లో మోదీ మొదటిసారి ఇజ్రాయెల్లో పర్యటించినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడింది. మోదీకి ‘స్పీకర్ ఆఫ్ ది క్నెస్సెట్ను’ ప్రదానం చేసిన తర్వాత, జాయింట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారతీయ వస్త్రాలు ధరించి, మోదీని ఆశ్చర్యపరిచారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: