📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Passport: కేవలం 15 రోజుల్లోనే పాస్‌పోర్ట్ మీ చేతికి

Author Icon By Vanipushpa
Updated: February 18, 2026 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విదేశాలకు వెళ్లాలని చాలామందికి ఉంటుంది. అయితే దానికి కావాల్సిన మొట్టమొదటి డాక్యుమెంట్ పాస్‌పోర్ట్. గతంలో పాస్‌పోర్ట్ పొందడం అంటే నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ సేవలను చాలా సరళతరం చేసింది. ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌ లో కేవలం కొన్ని నిమిషాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అసలు పాస్ పోర్ట్ ఎలా అప్లై చేయాలి (How to apply passport) అనే అంశంపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. 1. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముందుగా మీరు (‘Passport Seva’) అధికారిక వెబ్‌సైట్ (passportindia.gov.in) సందర్శించాలి. అక్కడ ‘New User Registration’ పై క్లిక్ చేసి మీ వివరాలతో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన తర్వాత.. మీ లాగిన్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి. అక్కడ ‘Apply for Fresh Passport’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 2. ఫారమ్ నింపడం, ఫీజు చెల్లింపు మీ వ్యక్తిగత వివరాలు, చిరునామా , ఫ్యామిలీ వివరాలను ఫారమ్‌లో జాగ్రత్తగా నింపాలి.

Bank jobs 2026: SBIలో 2,273 ఉద్యోగాలు.. రేపటితో గడువు ముగింపు

Passport: కేవలం 15 రోజుల్లోనే పాస్‌పోర్ట్ మీ చేతికి

15 రోజుల్లో పాస్‌పోర్ట్ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుకుంటుంది

తప్పులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ పాస్‌పోర్ట్ కోసం రూ. 1,500 , తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం రూ. 3,500 వరకు ఫీజు ఉంటుంది. ఇది ఆన్‌లైన్ పేమెంట్ (Net banking, Credit/Debit card) ద్వారా మాత్రమే చెల్లించాలి. 3. అవసరమైన డాక్యుమెంట్లు (Documents Required) పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు మీరు కొన్ని ముఖ్యమైన పత్రాలను తీసుకెళ్లాలి.. డేట్ ఆఫ్ బర్త్ : ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా టెన్త్ క్లాస్ మెమో. చిరునామా ధృవీకరణ: ఓటర్ ఐడి, కరెంట్ బిల్లు, లేదా బ్యాంక్ పాస్‌బుక్. ఫోటోలు: సాధారణంగా పాస్‌పోర్ట్ కేంద్రంలోనే ఫోటో తీస్తారు, కానీ బ్యాకప్‌గా వెంట ఉంచుకోవడం మంచిది. 4. అపాయింట్‌మెంట్ , వెరిఫికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మీకు నచ్చిన తేదీన పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (PSK) లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీ డాక్యుమెంట్లను పరిశీలిస్తారు, బయోమెట్రిక్స్ (వేలిముద్రలు) తీసుకుంటారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత.. పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. పోలీసులు మీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

fast passport processing India Indian passport news Passport Application Process passport in 15 days passport verification update tatkal passport service Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.