📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

India: రంజాన్‌ మాసంలో అఫ్గాన్ పై పాక్​ దాడులు ..మండిపడ్డ భారత్‌

Author Icon By Vanipushpa
Updated: February 23, 2026 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అఫ్గానిస్థాన్‌(Afghanistan)పై పాకిస్థాన్‌ వైమానిక దాడులు జరపడాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా పౌరులు మరణించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్​ జైస్వాల్​ ఒక ప్రకటనను విడుదుల చేశారు. ‘పవిత్ర రంజాన్​ నెలలో మహిళలు, పిల్లలు సహా పౌరుల ప్రాణనష్టం దారితీసిన అప్గాన్ భూభాగంపై పాకిస్థాన్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాలను బయటకు మళ్లించడానికి చేసిన మరో ప్రయత్నం. అఫ్గాన్ సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రత, స్వతంత్రతకు భారత్ మద్దతు ఇస్తూనే ఉంటుంది’ అని రణధీర్​ జైస్వాల్ తెలిపారు.

Read Also: Cash withdrawal using Aadhaar: కార్డు లేకపోయినా నగదు విత్‌డ్రా.. ఆధార్ ఉంటే చాలు!

India: Pakistan attacks Afghanistan during the month of Ramadan..India is angry

కాబూల్‌లోని పాకిస్థాన్ రాయబారికి సమన్లు జారీ

ఇదిలా ఉండగా, ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్ (IEA) విదేశాంగ మంత్రిత్వ శాఖ కాబూల్‌లోని పాకిస్థాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది. నంగర్హార్, పక్తికా ప్రావిన్సులపై పాకిస్తాన్ సైన్యం దాడులు జరిపిందని తెలిపింది. ఈ ఘటనల్లో డజన్ల కొద్దీ పౌరులు మృతిచెందారని అప్గాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేసింది.
అఫ్గానిస్థాన్​పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో 80 మందికి పైగా మరణించినట్లు ఇస్లామాబాద్​ భద్రతా వర్గాలు తెలిపినట్లు స్థానిక మీడియాలు పేర్కొంది. ఇటీవలి ఆత్మాహుతి దాడులకు అఫ్గానిస్థాన్​లో ఉన్న మిలిటెంట్లను బాధ్యులుగా ఆరోపిస్తూ పాక్​ ఈ దాడులు చేపట్టినట్లు తెలిపాయి. నంగర్హార్, పక్తికా, ఖోస్ట్ ప్రావిన్సులలోని ఏడు ప్రాంతాలపై ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. లక్ష్యంగా తీసుకున్న ప్రదేశాల్లో నంగర్​హార్​లోని న్యూ సెంటర్ నం.1, న్యూ సెంటర్ నం.2, ఖోస్ట్‌లో ఖ్వారిజీ మౌల్వీ అబ్బాస్ సెంటర్, అలాగే పక్తికాలోని కొన్ని మిలిటెంట్ స్థావరాలు ఉన్నట్లు సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Afghanistan Pakistan border tensions India condemns Pakistan Pakistan airstrikes Afghanistan Ramzan conflict news South Asia security crisis Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.