Pakistan objects to Israel’s proposed: ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఆరు దేశాల కూటమిపై పాకిస్థాన్ అభ్యంతరం

Read Time:  1 min
Pakistan economic
Pakistan economic
FONT SIZE
GET APP

ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఆరు దేశాల కూటమిపై పాకిస్థాన్(Pakistan) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇండియా, అరబ్, ఆఫ్రికా, ఆసియా, మద్యధరా దేశాలైన (గ్రీస్, సైప్రస్) తో కలిసి షడ్భుజి కూటమి ఏర్పాటు చేయనున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన నేపథ్యంలో ఈ కూటమి తెరపైకి వచ్చింది. కానీ, పాకిస్థాన్ మాత్రం దీనిని ఇస్లామిక్ వ్యతిరేక కూటమిగా అభివర్ణించింది. భారత్, ఇతర దేశాలతో షడ్భుజి కూటమి ఏర్పాటుకు నెతన్యాహు చేసిన ప్రకటనను ఖండిస్తూ ఈ మేరకు పాక్ సెనేట్ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

Read Also: Modi instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ ప్రపంచ రికార్డు, 10 కోట్లు ఫాలోవర్లు!

Pakistan objects to Israel's proposed six-nation bloc
Pakistan objects to Israel’s proposed six-nation bloc

ఇజ్రాయెల్ చర్యలు, విధానాలను వ్యతిరేకిస్తూ..

ఇజ్రాయెల్ చర్యలు, విధానాలను వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల తరఫున అధికార కూటమిలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఎంపీ పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పవిత్ర స్థలాలు సహా ఆక్రమించుకున్న పాలస్థీనా భూభాగాల న్యాయపరమైన, చారిత్రక స్థితిని మార్చే ఏ ప్రయత్నాలనైనా తీర్మానం తీవ్రంగా విమర్శించినట్టు పాక్ పత్రిక నివేదించింది. ‘ప్రాంతీయ స్థిరత్వం, అంతర్జాతీయ చట్టపరమైన నిబంధనలను దెబ్బతీసే ప్రకటనలను సెనేట్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని తీర్మానం పేర్కొంది. ఇది అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధమని, పాలస్థీనియన్ల స్వీయ నిర్ణయం హక్కును తన మద్దతును పునరుద్ఘాటించింది. సోమాలిలాండ్‌ను అధికారికంగా గుర్తించిన మొదటి దేశం ఇజ్రాయెల్. గతేడాది డిసెంబరులో టెల్ అవీవ్ చేసిన ఈ ప్రకటనపై అమెరికాతో పాటు ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక, ఆరు దేశాల కూటమిని ప్రకటించిన నెతన్యాహు.. ఇందులో భారత్‌ ప్రధాన భాగస్వామి అని పేర్కొన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.