📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

India: ఐరాస వేదికలను దుర్వినియోగం చేస్తున్న పాక్

Author Icon By Vanipushpa
Updated: January 16, 2026 • 11:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విభజన అజెండా కోసం ఐక్యరాజ్యసమితి (ఐరాస) (UNO) వేదికలను పాకిస్థాన్‌ దుర్వినియోగం చేస్తోందని భారత్ మండిపడింది. ఐరాస ఛార్టర్ ప్రకారం లభించిన స్వీయ నిర్ణయ హక్కును పాక్ దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. స్వీయ నిర్ణయ హక్కును వాడుకొని బహుళత్వం కలిగిన ప్రజాస్వామిక దేశాల్లో విభజనవాదాన్ని ప్రోత్సహించేలా మాట్లాడకుండా పాక్‌ను నిరోధించాలని కోరింది. ఈ మేరకు ఐరాసలోని భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ ఎల్డోస్ మ్యాథ్యూ పున్నూస్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు.

Read Also: US Iran strike threat : ఇరాన్‌పై అమెరికా దాడి ఖాయమా? ట్రంప్ గతం ఏం చెబుతోంది?

India: ఐరాస వేదికలను దుర్వినియోగం చేస్తున్న పాక్

విభజన అజెండాతో విషం కక్కుతున్న పాక్‌

2025లో ఐరాస కార్యకలాపాలపై సెక్రెటరీ జనరల్ విడుదల చేసిన వార్షిక నివేదికపై అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఐరాస జనరల్ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మ్యాథ్యూ పున్నూస్ ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ సంకుచిత ఆలోచనా దృక్పథం నుంచి బయటికొచ్చి మాట్లాడుతుంటే, పాక్ మాత్రమే విభజన అజెండాతో విషం కక్కుతోందని ఆయన మండిపడ్డారు. భారత్‌లో ఒక భాగమైన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీరు గురించి మాట్లాడేందుకు ఐరాసను పాక్ వేదికగా చేసుకోవడం సరికాదన్నారు. పాక్ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ తాజాగా ఐరాసలో జమ్మూకశ్మీరు అంశాన్ని లేవనెత్తారు. దీనికి ఇప్పుడు మ్యాథ్యూ పున్నూస్ బలమైన కౌంటర్ ఇచ్చారు. “విభజనవాద అజెండాను అన్ని వేదికల్లో ప్రమోట్ చేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారిపోయింది.

పాక్‌ను నిలువరించాల్సిన అవసరం ఉంది: మ్యాథ్యూ పున్నూస్

మేం పాక్ వాదనకు కౌంటర్ ఇవ్వక తప్పదు. ఒకవేళ పాక్ నిరాధార ఆరోపణలు, అవాస్తవాలను మేం ఎప్పటికప్పుడు తిప్పి కొట్టకుంటే, అది వాస్తవ విరుద్ధ అంశాలను ఇలాగే చెబుతుంటుంది. మేం ఐరాసకు చెందిన అన్ని వేదికల్లో వాస్తవాలను తెలియజేస్తున్నాం. పాక్‌ను నిలువరించాల్సిన అవసరం ఉంది” అని మ్యాథ్యూ పున్నూస్ పేర్కొన్నారు.”గ్లోబల్ సౌత్ దేశాల సెంటిమెంట్‌ను ఐరాస గౌరవించాలి. ఆ దిశగా నిర్దిష్ట చర్యలను చేపట్టాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

India Pakistan Relations international diplomacy news Pakistan Diplomacy Pakistan UN misuse Telugu News online Telugu News Today UN political controversy United Nations platforms abuse

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.