పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) రీసెంట్ గా సియాల్ కోట్ లో ఒక కొత్త పిజ్జా హట్ అవుట్ లెట్ ను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఖవాజా.. రిబ్బన్ కత్తిరించారు. అంతా బాగానే జరుగుతోందని అందరూ అనుకున్నారు. ఇది పెద్ద విషయమే కాదు. కానీ దాని తరువాత జరిగిన తతంగం వల్ల ఖాజా నవ్వులపాలయ్యారు. రక్షణ మంత్రి ప్రారంభించిన పిజ్జా హట్ అవుట్ లెట్ ఒరిజినల్ ది కాదు. ఈ విషయం కాస్త పిజ్జా హట్ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దాంతో వాళ్ళు ఆ పిజ్జా హట్ తమది కాదని..అది అనధికారికమని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అందులో పిజ్జా హట్ పాకిస్తాన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిలో మా ప్రియమైన కస్టమర్లకు తెలియజేస్తున్నాం.. సియాల్‌కోట్ కంటోన్మెంట్‌లో ప్రారంభించిన పిజ్జా హట్ అవుట్‌లెట్ మాది కాదు. అది పిజ్జా హట్ పేరును, బ్రాండింగ్‌ను తప్పుగా వాడుకుంటుంది. పిజ్జా లవర్స్ దీన్ని గమనించగలరు అని అందులో రాసింది.
Read Also: Sunita Williams: అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్
దాంతో పాటూ మంత్రి ఓపెన్ చేసిన అవుట్‌లెట్‌కు పిజ్జా హట్ పాకిస్తాన్‌తో గానీ, దాని మాతృ సంస్థ అయిన యమ్!బ్రాండ్స్ తో గానీ ఎలాంటి చట్టపరమైన లేదా కార్యకలాపాల సంబంధం లేదని కూడా కంపెనీ స్పష్టం చేసింది. తమ ట్రేడ్‌మార్క్‌ను దుర్వినియోగం చేయడాన్ని ఆపడానికి, తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని కూడా పిజ్జా హట్ పాకిస్తాన్ తెలిపింది. పిజ్జా హట్ పట్టిన ఈ పోస్ట్ తో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పరువు నిలువునా పోయింది. పిజ్జాహట్ పోస్ట్ తో సియాల్‌కోట్ కంటోన్‌మెంట్‌లోని ఆ అవుట్‌లెట్ వద్ద రిబ్బన్ కత్తిరిస్తున్న ఆయన చిత్రాలను కూడా పోస్ట్ చేసింది. ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: