📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! ఏపీ సెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

Pakistan: ఉగ్రవాదంపై పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి బట్టబయలు

Author Icon By Vanipushpa
Updated: January 1, 2026 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉగ్రవాదంపై పాకిస్థాన్(Pakistan) ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది. ఇటీవల విడుదలైన ఒక వీడియో ఉగ్రవాదులు, పాక్ మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టింది. ముఖ్యంగా లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాద సంస్థతో దాని సంబంధాలను, కపట నాటకాలను ఈ వీడియో గుట్టురట్టుచేసింది. హఫీజ్ సయ్యద్ మద్దతు ఉన్న పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (పీఎంఎంఎల్) అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి మక్కీ ఉన్నారు. లాహోర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలలో పాల్గొన్న శక్తులు తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతించడం లేదనే పాక్ వాదనలు తుడిచిపెట్టేశారు. ‘ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఎలా వేదికను అందిస్తుందో ఇది బట్టబయలు చేస్తుంది’ అని భద్రతా దళాల సీనియర్ అధికారి ఒకరు అన్నారు.

Read Also: Huge Explosion : నూతన సంవత్సర వేడుకల వేళ స్విట్జర్లాండ్లో భారీ పేలుడు

Pakistan

50 ఏళ్ల వరకు భారత్ తమపై దాడి చేయలేదు

సమావేశంలో భారతదేశంపై మరోసారి బెదిరింపులకు దిగాడు. లైవ్ వీడియోలో భారత్ మరో 50 ఏళ్లు పాకిస్థాన్‌ను సవాలు చేయడానికి ధైర్యం చేయదని కసూరి ప్రగల్భాలు పలికాడు.భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో ఉలిక్కిపడిన విషయాన్ని పరోక్షంగా అంగీకరించాడు. మొత్తం మూడు గంటల ఈ వీడియోలో ఓ సమావేశంలో జరిగిన విషయాన్ని వివరిస్తూ.. ‘భారత్ విషయంలో తమకు ఎలాంటి భయం లేదని, వచ్చే 50 ఏళ్ల వరకు భారత్ తమపై దాడి చేయలేదు’ అని ధీమా వ్యక్తం చేశాడు. ఒక రిక్రూట్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఈ వ్యాఖ్యలు భారత్ ను తక్కువ అంచనా వేయడంలో లష్కర్ ధైర్యాన్ని, తీవ్రవాద కార్యకలాపాలలో ఇస్లామాబాద్ లోతైన పాత్రను తెలియజేస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ వీడియో పాకిస్థాన్ తీవ్రవాదానికి మద్దతు ఇస్తుందనడానికి తిరుగులేని సాక్ష్యమని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu CounterTerrorism Double Standards Global Politics National Security Pakistan Pakistan Politics Terrorism Terrorism Policies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.