పాకిస్థాన్(Pakistan), అఫ్గానిస్థాన్(Afghanistan) మధ్య భీకర దాడులు కొనసాగున్నాయి. తాము చేసిన దాడుల్లో ఇప్పటిదాకా 274 మంది తాలిబన్లు చనిపోయారని.. మరో 400 మంది గాయపడ్డారని పాకిస్థాన్ తెలిపింది. మరోవైపు తాము 55 మంది పాక్ సైనికులకు హతమార్చామని అఫ్గానిస్థాన్ చెబుతోంది. కానీ ఈ లెక్కల్లో గందరగోళం ఏర్పడింది. ఈ దాడుల్లో తమ సైనికులు 12 మంది చనిపోయారని పాకిస్థాన్ అంటోంది. తమవారు 13 మందే ప్రాణాలు కోల్పోయారని అఫ్గానిస్థాన్ చెబుతోంది. అఫ్గానిస్థాన్‌తో తాము బహిరంగ యుద్ధంలో ఉన్నట్లు శుక్రవారం పాకిస్థాన్ చెప్పిన సంగతి తెలిసిందే.
Read Also: Bengaluru Crime: డ్రగ్స్ ఇచ్చి యువతులపై అఘాయిత్యం
ఆపరేషన్ గజబ్-లిల్-హక్ (Operation Ghazab lil-Haq)
అఫ్గాన్ తాలిబన్ల దాడులకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ ఈ సైనిక చర్యను ప్రారంభించింది. వైమానిక దాడుల విస్తరణ: పాక్ వాయుసేన కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అఫ్గాన్ రాజధాని కాబుల్, కీలక నగరాలైన కాందహార్, నంగర్హర్, పక్తియా ప్రావిన్సులపై మెరుపు దాడులు చేసింది. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కూడా పేలుళ్లు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ లెక్కల ప్రకారం దాదాపు 300 మంది తాలిబన్లు మరణించగా, అఫ్గాన్ మాత్రం తమ సైనికులు 8 మంది మాత్రమే చనిపోయారని, మిగిలిన వారంతా సామాన్య పౌరులని (ముఖ్యంగా మహిళలు, పిల్లలు) పేర్కొంటోంది. తాలిబన్ల దాడుల్లో కేవలం 12 మంది పాక్ సైనికులే మరణించారని పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ చెప్పారు. అఫ్గాన్‌కు చెందిన 73 పోస్టులను తాము ధ్వంసం చేశామన్నారు. మరో 18 పోస్టులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
పాక్ సైనికులు మరణించినట్లు అఫ్గాన్ రక్షణశాఖ ప్రకటన
సరిహద్దుల్లో తాము జరిపిన దాడల్లో 55 మంది పాక్ సైనికులు మరణించినట్లు అఫ్గాన్ రక్షణశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మరికొందరినీ నిర్బంధించినట్లు చెప్పింది. పాక్‌కు చెందిన రెండు కీలక కార్యాలయాలు, 19 చెక్‌పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది. ఈ దాడులు ఇంకా ముగియలేదని.. తమవారు 13 మందే మరణించినట్లు స్పష్టం చేసింది. ఇదిలాఉండగా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా, తుర్కియే విదేశాంగ మంత్రులతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి వాళ్లకి వివరించారు. మరోవైపు తాజా పరిణామాలపై చైనా, రష్యా కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. దౌత్య మార్గాల ద్వారా ఈ వివాదాలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: