Pak-Afghan: పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌లు దాడుల్లో వందకు పైగా మృతి!

Read Time:  1 min
పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌లు దాడుల్లో వందకు పైగా మృతి!
పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌లు దాడుల్లో వందకు పైగా మృతి!
FONT SIZE
GET APP

ఈసారి మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. 55 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టినట్లు తాలిబన్లు ప్రకటించగా, 133 మంది తాలిబన్లను హతమార్చినట్లు పాక్‌ (Pakistan) సైన్యం వెల్లడించింది. తమవైపు కేవలం ఇద్దరు మాత్రమే మృతిచెందారని ముగ్గురు గాయపడ్డారని పాక్ తెలిపింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్​ కీలక ప్రకటన చేసింది. అఫ్గాన్‌(Afghanistan)పై బహిరంగ యుద్ధం ప్రారంభించినట్లు పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు.

Read Also: Pak-Afghan : పాక్-అఫ్గాన్ బార్డర్లో యుద్ధ వాతావరణం

Over 100 killed in Pakistan-Afghanistan attacks!
Over 100 killed in Pakistan-Afghanistan attacks!

4 గంటల పాటు కొనసాగించిన ఆపరేషన్‌

గత ఆదివారం పాక్‌ జరిపిన వైమానిక దాడికి ప్రతీకారంగా గురువారం రాత్రి అఫ్గాన్‌ తాలిబన్‌ దళాలు సరిహద్దులోని పాక్‌ మిలిటరీ స్థావరాలపై ముందుగా విరుచుకుపడ్డాయి. 4 గంటల పాటు కొనసాగించిన ఈ ఆపరేషన్‌లో 19 పాకిస్థానీ సైనిక పోస్టులు, 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లు అఫ్గాన్‌ పేర్కొంది. పాకిస్థానీ సైనికుల మృతదేహాలతో పాటు కొందరు సైనికులను సజీవంగా తమ దేశంలోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. గురువారం రాత్రి అఫ్గాన్‌ దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్‌ సైన్యం అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. మరోవైపు మృతులకు సంబంధించి తాలిబన్ల ప్రకటనను పాకిస్థాన్‌ సైన్యం తోసిపుచ్చింది. తమవైపు కేవలం ఇద్దరు మాత్రమే మృతిచెందారని ముగ్గురు గాయపడ్డారని తెలిపింది. 133 మంది తాలిబన్లను మట్టుబెట్టామని 200 మందికి గాయాలయ్యాయని పాక్‌ ప్రధాని అధికార ప్రతినిధి మొషార్రఫ్‌ జైదీ తెలిపారు. ధ్రువీకరణలేని కొన్ని దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని చెప్పారు. పాక్, అఫ్గాన్‌ల మధ్య దాదాపు 2,611 కిలోమీటర్ల డ్యూరాండ్‌ సరిహద్దు ఉంది. అయితే దానిని అఫ్గానిస్థాన్‌ అధికారికంగా గుర్తించడం లేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.