బలమైన కంటెంట్ ఉంటే చిన్న సినిమాలకూ పెద్ద స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కుతుందన్నది మరోసారి రుజువైంది. అదే కోవలోకి వచ్చే చిత్రం ‘దండోరా’ పెద్ద బడ్జెట్, భారీ ప్రమోషన్లు లేకపోయినా, కథా బలంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సినిమాగా ఇది నిలిచింది. సామాజిక అంశాలను స్పృశిస్తూ, కమర్షియల్ హంగులతో సహజత్వానికి దగ్గరగా ఉండేలా ఈ సోషల్ ఎమోషనల్ డ్రామాని రూపొందించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రశంసలు దక్కాయి.
Read Also: TG: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ
చిత్ర యూనిట్ పై ప్రశంసలు
“ఇప్పుడే ‘దండోరా’ సినిమా చూశాను. ఇది ఆలోచింపజేసే, శక్తివంతమైన సినిమా. శివాజీ గారు, నవదీప్, నందు, రవి కృష్ణ, బిందు మాధవి అద్భుతమైన నటనను కనబరిచారు. ఇంతటి బలమైన, రూటెడ్ కథను ఇంత బాగా రూపొందించినందుకు దర్శకుడు మురళీ కాంత్ గారికి నా అభినందనలు.
ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చి, ముందుకు నడిపించినందుకు రవీంద్ర బెనర్జీ గారికి అభినందనలు. ఇంత అద్భుతమైన చిత్రానికి సపోర్ట్ గా ఉన్నందుకు, అందులో భాగమైనందుకు సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు” అంటూ రాసుకొచ్చాడు ఎన్టీఆర్ (NTR) . దీంతో, ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అలాగే తమ సినిమాపై ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పోస్ట్ చేయడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: