📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Nigeria: నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

Author Icon By Vanipushpa
Updated: February 5, 2026 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నైజీరియా(Nigeria)లోని క్వారా రాష్ట్రంలో ఉన్న వోరో, నూక అనే రెండు గ్రామాలను ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ఒక్కసారిగా సాయుధ దుండగులు గ్రామాల్లోకి చొరబడి ప్రజలను చుట్టుముట్టారు. దుండగులు గ్రామస్తుల చేతులను వెనక్కి విరిచి కట్టి, ఆపై కాల్చి చంపారు. ఈ దాడిలో దాదాపుగా 200 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కేవలం హత్యలు చేయడమే కాకుండా గ్రామాల్లోని ఇళ్లను, దుకాణాలకు నిప్పు పెట్టి కాల్చేశారు. ప్రాణభయంతో కొందరు ప్రజలు అడవుల్లోకి పరుగులు తీశారు. వీధుల్లో ఎక్కడ చూసినా కూడా శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా ఖండించింది.

Read Also: World Cancer Day 2026: నేడు వరల్డ్ క్యాన్సర్ డే

Nigeria: నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

ప్రతీకారంగా ఈ దాడి

గత ఐదు నెలలుగా దుండగులు గ్రామస్థులను హెచ్చరిస్తూ లేఖలు పంపుతున్నా, ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకారంగా ఈ దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల నైజీరియా సైన్యం ఉగ్రవాదులే లక్ష్యంగా జరిపిన ఆపరేషన్‌లో సుమారు 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తమ వారిని చంపినందుకు ప్రతీకారంగానే సాయుధ ముఠాలు ఈ నరమేధానికి పాల్పడి ఉండవచ్చని క్వారా గవర్నర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. అలాగే కాట్సినా రాష్ట్రంలో కూడా దుండగులు రెచ్చిపోయారు. అక్కడ జరిగిన దాడిలో మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

african terrorism news Boko Haram attack mass killing Nigeria Nigeria security crisis Nigeria terror attack Nigeria violence news Telugu News Paper Telugu News Today terrorist attack Africa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.