భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ (Nitin Nabin) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నబీన్ ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు ఉదయం ఢిల్లీలో నబీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. నితిన్ నబీన్ ప్రస్తుతం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.
Read Also: Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గత ఏడాది డిసెంబర్‌లో బీజేపీ ప్రకటించింది
ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ ఎన్నిక జరిగింది. నితిన్ నబీన్ (46) బీహార్ రాష్ట్రానికి చెందినవారు. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గత ఏడాది డిసెంబర్‌లో బీజేపీ ప్రకటించింది. ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు అప్పుడే వార్తలు వెలువడ్డాయి. నబీన్‌కు ఆరెస్సెస్ నేపథ్యం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపూర్ నుంచి నబిన్ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: