📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Saketh: అదృశ్యమైన సాకేత్ మృతదేహం కాలిఫోర్నియాలో లభ్యం

Author Icon By Vanipushpa
Updated: February 16, 2026 • 1:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America) లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆరు రోజుల క్రితం అదృశ్యమైన భారతీయ విద్యార్థి 22 ఏళ్ల సాకేత్ శ్రీనివాసయ్య(Saketh Sreenivasaiah) చివరకు శవమై తేలాడు. కర్ణాటకకు చెందిన ఈయన మృతదేహం తాజాగా కాలిఫోర్నియాలో లభ్యం కావడంతో.. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. కాలిఫోర్నియాలోని బర్కలే విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంఎస్ చదువుతున్న సాకేత్.. ఫిబ్రవరి 9వ తేదీన చివరి సారిగా కనిపించాడు.

Read Also: Rajasthan: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

Saketh: అదృశ్యమైన సాకేత్ మృతదేహం కాలిఫోర్నియాలో లభ్యం

కేసు నమోదు, పోలీసులు దర్యాప్తు

యూనివర్సిటీ క్యాంపస్‌కు సుమారు ఒక కిలోమీటరు దూరంలో గత సోమవారం చూసినట్లు ప్రత్యక్ష సాక్షలు వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎఫ్‌బీఐ అధికారులు కూడా రంగంలోకి దిగి ముమ్మరంగా గాలించారు. ఈక్రమంలోనే లేక్ అంజా సమీపంలో సాకేత్‌కు చెందిన బ్యాక్‌ప్యాక్, ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్ లభించాయి. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవగా.. ఎట్టకేలకు కాలిఫోర్నియాలోనే పోలీసులు అతడి మృతదేహాన్ని గుర్తించారు.సాకేత్ శ్రీనివాసయ్యకు చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. అయితే ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన.. అక్కడ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చర్‌గా, యంగ్ రీసెర్చ్ ఫెలోగా పని చేశారు. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, యూనిలీవర్ వంటి దిగ్గజ సంస్థల్లో ఇంటర్న్‌గా అనుభవం గడించారు. సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేయాలనే తపనతో అమెరికా వెళ్లారు. ఐఐటీ మద్రాస్‌లోని ఈ-సెల్‌లో కూడా కీలక నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు ఈ మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

california Crime Investigation Indian Student in USA Latest News in Telugu Missing Person Case NRI News Overseas Indians Saket Case Telugu News Paper Tragic death US investigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.