📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Miryalaguda Crime: అర్హత లేకున్నా కంటి వైద్యం.. చూపు కోల్పోయిన మహిళ

Author Icon By Rajitha
Updated: February 26, 2026 • 2:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Miryalaguda Crime: మిర్యాలగూడలోని డాక్టర్స్ కాలనీలో మహాలక్ష్మి ఐ క్లినిక్ నిర్వహిస్తున్న వికాస్ కుమార్ అనే వ్యక్తి కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. కానీ ఒక నకిలీ సర్టిఫికెట్ సాయంతో తానే పెద్ద డాక్టర్‌గా చలామణి అవుతూ ప్రజలకు వైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో బైరెడ్డి పద్మ అనే మహిళకు కంటి శుక్లాల ఆపరేషన్ చేయగా, అది విఫలమై ఆమె కుడి కంటి చూపు పూర్తిగా పోయింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు లోతుగా విచారణ జరిపి అసలు నిజాన్ని బయటపెట్టారు. మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సదరు ఫేక్ డాక్టర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. 

Read also: POCSO case: బాలికలపై అత్యాచారం.. జ్యోతిషుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

Eye treatment without qualification

అధికారుల ఆకస్మిక తనిఖీలు

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పోలీసులతో కలిసి పట్టణంలోని పలు కంటి ఆస్పత్రులపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వికాస్ కుమారే కాకుండా వల్కీ శ్రీను, శివకోటేశ్వరరావు, వెంకటేశ్‌, గడ్డం నాగరాజు అనే వ్యక్తులు కూడా ఎలాంటి విద్యార్హతలు లేకుండా క్లినిక్‌లు (Clinic) నడుపుతున్నట్లు తేలింది. వీరంతా కన్సల్టెంట్ డాక్టర్ల ముసుగులో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని అధికారులు గుర్తించారు. నిబంధనలు అతిక్రమించిన ఐదు క్లినిక్‌ల నిర్వాహకులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కఠిన హెచ్చరికలు

ప్రజల ప్రాణాలతో మరియు ఆరోగ్యంతో ఆడుకునే ఇలాంటి నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. లైసెన్స్ లేని ఆస్పత్రులకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు. నిందితులందరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వారు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, ఎవరైనా అనధికారికంగా వైద్యం చేస్తే జైలుకు పంపడం ఖాయమని అధికారులు గట్టిగా హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Eye Surgery Fraud Fake Doctor Arrest Miryalaguda news nalgonda crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.