📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Bangladesh: మైనార్టీలపై 51 దాడులు: ఐక్య పరిషత్ నివేదిక

Author Icon By Vanipushpa
Updated: January 7, 2026 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ (Bangladesh) 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ దేశంలో మైనారిటీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ముఖ్యంగా హిందూ సమాజమే లక్ష్యంగా జరుగుతున్న మతపరమైన హింస ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తోంది. శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీల ప్రాణాలను, మానవ హక్కులను కాపాడటంలో ఘోరంగా విఫలం అయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నెలలోనే 51 దాడులు జరగడం అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది.

మతపరమైన హింసాత్మక ఘటనలు

బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కేవలం డిసెంబర్ నెలలోనే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 51 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదు అయ్యాయి. వీటిలో 10 హత్యలు, 23 లూటీలు, దహనకాండలు చోటుచేసుకున్నాయి. దొంగతనాలు, తప్పుడు దైవదూషణ ఆరోపణలతో అక్రమ అరెస్టులు, చిత్రహింసలు వంటి సంఘటనలు మైనారిటీల ఇళ్లు, దేవాలయాలు, వ్యాపార సంస్థల చుట్టూనే సాగాయని కౌన్సిల్ స్పష్టం చేసింది.

Read Also: Breaking News: Karur stampede: టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు?

Bangladesh: మైనార్టీలపై 51 దాడులు: యూనస్ ప్రభుత్వ నివేదిక

కొత్త ఏడాదిలోనూ కొనసాగుతున్న మారణకాండ

కొత్త ఏడాది మొదలైనా హింస తగ్గకపోవడం గమనార్హం. జనవరి 2న లక్ష్మీపూర్‌లో సత్యరంజన్ దాస్ అనే రైతు వరి పొలానికి నిప్పు పెట్టారు. మరుసటి రోజు షరియత్ పూర్‌లో వ్యాపారి ఖోకన్ చంద్ర దాస్‌ను కిరాతకంగా నరికి, నిప్పు పెట్టి చంపేశారు. ఛటోగ్రామ్, కుమిల్లా ప్రాంతాల్లో సాయుధ దుండగులు కుటుంబాలను బందీలుగా చేసి బంగారం, నగదు దోచుకున్నారు. ఝెనైదాలో ఓ హిందూ విధవరాలిని సామూహిక అత్యాచారం చేసి, గుండు గీసి, చెట్టుకు కట్టేసి చిత్ర హింసలకు గురిచేసిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. జెసోర్‌లో ఐస్ ఫ్యాక్టరీ యజమాని రామ ప్రతాప్ బైరాగిని బహిరంగంగా గొంతు కోసి చంపడం అక్కడి అరాచక పాలనకు పరాకాష్టగా నిలిచింది.
ఇంత జరుగుతున్నా యూనస్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Government Report Human Rights Law and order Minority Attacks Minority Rights Political Situation Social issues Telugu News Paper Telugu News Today Yunus Government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.