📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు

India: పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే సైనిక చర్య తప్పదు: ఉపేంద్ర ద్వివేది

Author Icon By Vanipushpa
Updated: January 13, 2026 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్ పై భారత ఆర్మీ చీఫ్ భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ తో యుద్ధానికి శ్రీకారం చుట్టిన గత ఏడాది మే 10వ తేదీ నుండి ఇఫ్పటివరకు 31​​మంది పాకిస్తాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదులను హతమార్చామని అన్నారు. వీరిలో 65 శాతం మంది పాకిస్తాన్ సంతతికి చెందినవారేనని తేల్చి చెప్పారు. వీరిలో పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను ఆపరేషన్ మహాదేవ్‌ సందర్భంగా కాల్చి చంపినట్లు వెల్లడించారు. తాజాగా ఉపేంద్ర ద్వివేదీ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది మే 10 నుండి వెస్ట్రన్ ఫ్రంట్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వెంబడి పరిస్థితి సమస్యాత్మకం, సున్నితంగానే ఉందని అన్నారు. భద్రత బలగాలు ఎప్పటికప్పుడు కూంబింగ్ నిర్వహిస్తోన్నాయని, దీనివల్ల సరిహద్దు గ్రామాల్లో చెలరేగిన ఉద్రిక్త వాతావరణం నియంత్రణలో ఉందని స్పష్టం చేశారు.

Read Also: India: జర్మనీలో భారతీయ ప్రయాణికులకు ట్రాన్సిట్ వీసా రద్దు

India: పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడితే సైనిక చర్య తప్పదు: ఉపేంద్ర ద్వివేది

ఆపరేషన్ సింధూర్ 2 ఇప్పుడూ కొనసాగుతున్నది

జమ్మూ కాశ్మీర్ లో క్రియాశీలంగా ఉన్న స్థానిక ఉగ్రవాదుల సంఖ్య చాలావరకు తగ్గిందని, దాదాపుగా సింగిల్ డిజిట్‌కు చేరిందని ఉన్నారు. 2025లో జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఇద్దరు స్థానికులు మాత్రమే ఉగ్రవాద సంస్థల్లో చేరారని ఉపేంద్ర ద్వివేది అన్నారు. అభివృద్ధి కార్యకలాపాలు, పర్యాటక రంగం పునరుద్ధరణ వంటి చర్యల వల్ల ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయని, అమర్‌నాథ్ యాత్రలో అయిదేళ్ల సగటు కంటే అధికంగా నాలుగు లక్షలకు పైగా యాత్రికులు పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ 2 ఇప్పుడూ కొనసాగుతోందని, పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా సరే.. సైనిక చర్యకు దిగుతామని ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ఎటువంటి తప్పిదానికి పాల్పడినా ధీటుగా బదులిస్తామని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్‌లో ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని, వాటిల్లో ఎల్‌ఓసీ, మరో రెండు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయని తెలిపారు.

పాకిస్తాన్ కు మరోసారి పరాభం తప్పదు

వీటిద్వారా ఎటువంటి చర్యలకు పాల్పడినా పాకిస్తాన్ కు మరోసారి పరాభం తప్పదనీ తేల్చి చెప్పారు. సంప్రదాయ యుద్ధ కార్యకలాపాలకు అవకాశం తగ్గిపోయి, నేరుగా అణు రంగంలోకి వెళ్తామని అందరూ భావించారని, దీనికి భిన్నంగా వ్యవహరించామని పేర్కొన్నారు. యుద్ధ రీతుల్లో సంప్రదాయ కార్యకలాపాల పరిధిని మరింత విస్తరించుకున్నామని వివరించారు. పాకిస్తాన్‌ రాజకీయ నాయకులు, అక్కడి ప్రజలే దీని గురించి మాట్లాడారని, మిలటరీ నుండి అలాంటి సూచనలేవీ తనకు అందలేదని స్పష్టం చేశారు. యుద్ధం కొనసాగిన ఆ 88 గంటల్లో సంప్రదాయ యుద్ధ కార్యకలాపాల పరిధిని విస్తరించడానికి అసాధారణంగా సైన్యాన్ని సమీకరించుకున్నామని తెలిపారు. పాకిస్తాన్ ఏ మాత్రం తప్పు చేసినా, మళ్లీ ఆపరేషన్ ప్రారంభించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Border Security Cross-Border Tensions India-Pakistan Relations Military response national defense Pakistan provocation Telugu News online Telugu News Today Upendra Dwivedi statement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.