📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

India: సముద్రం మధ్యలో భారీ విమానాశ్రయం

Author Icon By Vanipushpa
Updated: January 29, 2026 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక అడుగు వేయడానికి సిద్ధమైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా తీరంలో ఉన్న వధవన్ వద్ద దేశంలోనే మొట్టమొదటి ఆఫ్ షోర్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది భూమి మీద కాకుండా అరబిక్ సముద్రంలో కృత్రిమంగా సృష్టించిన ద్వీపంలో నిర్మితం కానుంది. మన దేశంలో (India) ఇప్పటివరకు ఇలాంటి సాహసోపేతమైన ఇంజనీరింగ్ అద్భుతం ఎప్పుడూ జరగలేదు. ముంబై లాంటి మెట్రో నగరాల్లో భూమి కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. సముద్రాన్ని భూమిగా మార్చి విమానాశ్రయం కట్టడం అనేది ఒక విప్లవాత్మక నిర్ణయం అని చెప్పవచ్చు.

Read Also: Plane Crash: అజిత్ పవార్ దుర్మరణం.. బారామతిలో విషాదం

India: సముద్రం మధ్యలో భారీ విమానాశ్రయం

ఈ భారీ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 45,000 కోట్లు

ఈ భారీ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ. 45,000 కోట్లు. ఇందులో విశేషం ఏమిటంటే.. కేవలం సముద్రపు నీటిని వెనక్కి నెట్టి భూమిని సృష్టించడానికి రూ. 25,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. అంటే ప్రాజెక్ట్ వ్యయంలో సగానికి పైగా కేవలం భూమి తయారీకే కేటాయిస్తున్నారు. మిగిలిన రూ. 20,000 కోట్లతో అత్యాధునిక విమానాశ్రయ టెర్మినల్స్, రన్‌వేలు, ఇతర ఆధునిక సదుపాయాలను నిర్మిస్తారు. జపాన్‌లోని కన్సాయ్ లేదా హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయాల తరహాలో ఈ వధవన్ ఎయిర్ పోర్ట్ రూపుదిద్దుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆఫ్‌షోర్ ఎయిర్‌పోర్టులు చాలా తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు భారత్ కూడా ఆ వరుసలో చేరబోతోంది. 90 మిలియన్ల ప్రయాణికులు.. 3 మిలియన్ టన్నుల కార్గో! ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లపై పెరుగుతున్న రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ కానుంది. ఈ విమానాశ్రయం పూర్తయితే ఏటా సుమారు 9 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ప్రయాణం ఇక చాలా ఈజీ!

అద్భుతమైన కనెక్టివిటీ.. ప్రయాణం ఇక చాలా ఈజీ! వధవన్ విమానాశ్రయానికి చేరుకోవడం ప్రయాణికులకు ఏమాత్రం కష్టం కాకుండా ప్రభుత్వం భారీ ప్లాన్ వేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పలు కనెక్టివిటీ మార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రధానంగా వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకి ఈ విమానాశ్రయాన్ని నేరుగా అనుసంధానిస్తారు. అలాగే వెస్ట్రన్ రైల్వే నెట్‌వర్క్ మరియు ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్‌తో కూడా దీనిని లింక్ చేస్తారు. దీనివల్ల గుజరాత్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి ప్రయాణికులు చాలా తక్కువ సమయంలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవచ్చు. అదనంగా, ఉత్తన్-విరార్ సీ లింక్ ద్వారా కూడా రోడ్డు మార్గాన వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త బూస్ట్ మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ (MADC) ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రి-ఫీజిబిలిటీ స్టడీని దాదాపు పూర్తి చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

artificial island airport Floating airport futuristic airports mega infrastructure project ocean engineering offshore airport sea airport project smart infrastructure Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.