📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

Venezuela: వెనెజువెలా రాజధాని కరాకస్ లో భారీ పేలుళ్లు

Author Icon By Vanipushpa
Updated: January 3, 2026 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ వెనెజువెలా(Venezuela) మీదా అమెరికా అధ్యక్షుడు ట్రంఫ్‌ గత కొంతకాలంగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆ దేశ రాజధాని కరాకస్ లో భారీ పేలుళ్లు చోటుచేసుకోవడం కలకలం రేపింది. నిమిషాల వ్యవధిలో ఏడు ప్రాంతాల్లోఈ పేలుళ్లు సంభవించాయి. విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్న శబ్దాలు వినిపించాయని స్థానికులు పేర్కొన్నట్లు ఆదేశ మీడియా తెలిపింది. డ్రగ్స్ ను తరలిస్తున్న బోట్స్, జలాంతర్గాములపై అమెరికా దాడులను ముమ్మరం చేసింది. ఈ పరిణామాల నడుమ తాజాగా వెనెజువెలాలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున పేలుడు శబ్దాలు వినిపించడంతో.. ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.

Read Also: New Year attack plot : న్యూ ఇయర్ దాడి కుట్ర, ISIS ప్రభావంతో యువకుడి అరెస్ట్, హామర్లు–కత్తులు స్వాధీనం

Venezuela: వెనెజువెలా రాజధాని కరాకస్ లో భారీ పేలుళ్లు

మాదకద్రవ్యాల కార్యకలాపాలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవు

కాగా, అమెరికా సైన్యం విడుదల చేసిన వివరాల ప్రకారం.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు అమెరికా 30 వరకు దాడులు చేసిందన్నారు. ఈ దాడుల్లో 107 మంది మరణించినట్లు తెలిపింది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో మాత్రం మాదకద్రవ్యాల కార్యకలాపాలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొనడం గమనార్హం. తమదేశంలో ఉన్న అతిపెద్ద చమురు నిల్వలు, అరుదైన భూమి ఖనిజ సంపద కోసం ట్రంప్ తనను అధికారం నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా.. ఇప్పటి వరకూ వెనెజువెలా ప్రభుత్వం కానీ, అమెరికా కానీ ఈ పేలుళ్లపై స్పందించకపోవడం గమనార్హం. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుజులాకు గతంలోనే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ దేశ గగనతలంపైనా ట్రంప్ ఆంక్షలు విధించారు. రోడ్డు, స‌ముద్ర మార్గం ద్వారా అమెరికాలోకి డ్రగ్స్ రవాణా నిలిపివేయాల‌ని వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే క‌రేబియ‌న్ దీవుల్లో త‌మ యుద్ధనౌక‌లు మోహ‌రించి ఉన్నాయ‌ని వాటిపై దాడి చేస్తామ‌ని హెచ్చరించాడు. అంతే కాకుండా వెనుజులా అధ్యక్షుడు నికోల‌స్ మ‌దురో ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని హెచ్చిరించాడు. ఇక తాజాగా ట్రంప్ చెప్పిన‌ట్టుగానే వెనుజులాపై మెరుపు దాడులు మొద‌ల‌య్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

blast news Caracas explosions emergency situation international news Latin America Security Alert Telugu News Paper Telugu News Today Venezuela Venezuela capital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.