📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Budget 2026: ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే!

Author Icon By Vanipushpa
Updated: January 31, 2026 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. కానీ, ఈసారి రాబోయే ఫిబ్రవరి 1 చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ (Budget 2026) ప్రవేశపెట్టబోతున్నారు. అయితే కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, మీ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే మరికొన్ని కీలకమైన కొత్త రూల్స్ (New rules) కూడా రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరల దగ్గరి నుండి ఫాస్టాగ్ రూల్స్ వరకు మీరు తెలుసుకోవాల్సిన ఆ 5 మార్పులు ఇవే..

Read Also: Kamal Hasan : ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

Budget 2026: ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే!

పన్నుల్లో ఊరట లభిస్తుందా?

యూనియన్ బడ్జెట్ 2026 – పన్నుల్లో ఊరట లభిస్తుందా? ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆదాయపు పన్ను స్లాబ్‌లలో ఏవైనా మార్పులు ఉంటాయా? అని మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచుతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటనలు మీ భవిష్యత్తు పొదుపు, పన్ను బాధ్యతలపై నేరుగా ప్రభావం చూపుతాయి. గ్యాస్ సిలిండర్ ధరల సవరణ ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ (LPG) ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో వస్తున్న మార్పుల వల్ల ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకే కొత్త ధరలు వెల్లడికానున్నాయి. కమర్షియల్ సిలిండర్లతో పాటు డొమెస్టిక్ గ్యాస్ ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనేది రేపు తేలిపోతుంది.

పాన్-ఆధార్ లింకింగ్ తప్పనిసరి

బ్యాంకింగ్, సేవింగ్స్ ఖాతాల్లో మార్పులు ఫిబ్రవరి 1 నుంచి ఐసీఐసీఐ (ICICI) , హెచ్‌డిఎఫ్‌సి (HDFC) వంటి ప్రధాన బ్యాంకులు తమ సేవా రుసుములను మార్చుతున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లు, రెంట్ పేమెంట్స్‌పై అదనపు ఛార్జీలు , మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ నియమాలు మారబోతున్నాయి. కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను కూడా సవరించే అవకాశం ఉంది. దానికి తోడైన బడ్జెట్ 2026.. 5. పాన్-ఆధార్ లింకింగ్, ఇతర డెడ్ లైన్లు మీ ఫైనాన్షియల్ లావాదేవీలు ఆగిపోకూడదంటే పాన్-ఆధార్ లింకింగ్ తప్పనిసరి. ఫిబ్రవరి 1 నుండి KYC అప్‌డేట్ చేయని డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలపై కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. అలాగే సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్నులు విధిస్తుండటంతో వాటి ధరలు కూడా పెరగవచ్చు.

    Read hindi news: hindi.vaartha.com

    Read Also Epaper : epaper.vaartha.com

    Read Also:

    February 1 new rules government rules update India new rules mandatory changes from February 1 new regulations February public advisory February 1 Telugu News Paper Telugu News Today

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.