Malla Reddy-Supreme Court: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని జీడిమెట్ల భూ సర్వేకు సంబంధించి తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న మల్లారెడ్డి కుటుంబ సభ్యుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Read Also: Sanathnagar Murder Case: కత్తితో పొడిచి చంపిన దుండగులు
వివాదానికి కారణమైన జీడిమెట్ల భూమి
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జీడిమెట్ల సర్వే నం. 82/1/ఈఈలో గల 0.33 గుంటల భూమికి హద్దులు నిర్ణయించాలని కోరుతూ శేరి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తన భూమికి వెళ్లే దారిని మూసివేశారని, ఈ విషయంలో తహసీల్దార్ జారీ చేసిన లేఖను కూడా ఆయన తన పిటిషన్‌లో సవాల్ చేశారు.దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి, 45 రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఈ తీర్పును మల్లారెడ్డి తదితరులు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేయగా, సింగిల్ జడ్జి ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నిన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: